Moviesమెగా ఫ్యామిలీ నుండి మరో హీరోయిన్.. ఈ ఊహించని ట్విస్ట్ మామూలుగా...

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరోయిన్.. ఈ ఊహించని ట్విస్ట్ మామూలుగా లేదుగా..!?

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఉండే సగానికి మందికి పైగా హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లే కావడం గమనార్హం. కాగా ఇండస్ట్రీలో ఎంతో మంది మెగా హీరోలు ఉందగా..హీరోయిన్గా మాత్రం ఎంట్రీ ఇచ్చింది ఒక్కరే. అదే నీహారిక.

అమ్మడు కూడా సక్సెస్ కాలేదు ఫ్లాప్ అయిపోయింది . కాగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. రీసెంట్ గా మెగా మనవరాలు నివృతి కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి ట్రై చేస్తుందట . అందుకే ఇప్పటినుంచే దానికి తగ్గట్టు శిక్షణ తీసుకుంటుందట . యాక్టింగ్ నేర్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చి తాత పేరుని నిలబెట్టే విధంగా మనవరాలు కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలని ట్రై చేస్తుందట .

దీంతో మెగా ఫ్యాన్స్ వద్దురా బాబోయ్ ఆమె ఎంట్రీ ఇవ్వద్దు మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్స్ ఏ వద్దు అంటున్నారు. మరి కొంతమంది ఇంకా జెండర్ డిఫరెన్స్ ఏంటి .. ఎవరైనా ఒకటే ..ఇండస్ట్రీలోకి ఎవరైనా హీరోయిన్గా రావచ్చు అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు . చూడాలి మరి ఈ విషయంలో శ్రీజ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. నివృత్తి హీరోయిన్గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news