Movies"అఖిల్ జాతకంలో అతి పెద్ద దోషం..హిట్ పడాలంటే అదొక్కటే మార్గం".. వేణు...

“అఖిల్ జాతకంలో అతి పెద్ద దోషం..హిట్ పడాలంటే అదొక్కటే మార్గం”.. వేణు స్వామి అంతమాట అనేశాడు ఏంట్రా బాబు..!!

తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు పాపం అక్కినేని అఖిల్ ఏది పట్టుకున్న సరే బ్లాస్ట్ అయిపోతుంది . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అక్కినేని అఖిల్ ఏ విధంగా సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన అఖిల్ ఏజెంట్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది .

ఈ క్రమంలోనే అఖిల్ ని ఏకీపారిస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అఖిల్ అక్కినేని సినిమాలకు పనికిరాడు అంటూ బూతులు తిడుతూ ఉండడం గమనార్హం . ఈ క్రమంలోనే వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు . రీసెంట్గా అఖిల్ జాతకాన్ని బయటపెట్టిన వేణు స్వామి ఆయనకు హిట్ పడాలంటే అదొక్కటే మార్గం అంటూ బిగ్ బాంబు పేల్చారు . మనకు తెలిసిందే గతంలో నాగచైతన్య సమంత విడిపోతారు అంటూ వేణు స్వామి ముందే చెప్పారు . ఆయన చెప్పిన కొన్నాళ్లకే అది జరిగింది . ఆ తర్వాత వేణు స్వామి చాలా మంది సెలబ్రిటీస్ విషయాలల్లో చెప్పింది తూచా తప్పకుండా జరిగింది .

ఈ క్రమంలోనే అఖిల్ అక్కినేని పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . వేణు స్వామి మాట్లాడుతూ అక్కినేని అఖిల్ కి నాగదోషం ఉంది. ఆ దోషం ఉన్నప్పుడు పక్క వాళ్ళ సలహాలు మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి . అంతేకాదు ప్రెసెంట్ అక్కినేని అఖిల్ జాతక ప్రకారం చంద్రుడు నీచంలో ఉన్నాడు. తల్లి చంద్రుడికి తండ్రి సూర్యుడికి సంకేతం .. ఈ విధంగా ఉన్నప్పుడు అఖిల్ అమలకు దూరంగా ఉండాలి . అమల సలహాలు ఏవి తీసుకోకూడదు. మరి ముఖ్యంగా అమల గారి ప్రమేయం మాత్రం కలిసి రాదు అంటూ చెప్పుకొచ్చారు వేణు స్వామి. అంతేకాదు అఖిల్ హిట్ కొట్టాలంటే సొంత తెలివితేటలతో సినిమాను ఓకే చేసుకోవాల్సిందే .. నాగదోషానికి నివారణ చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే అఖిల్ కెరియర్ పై వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెంద్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news