Moviesఅప్పుడు కాజల్.. ఇప్పుడు రష్మిక.. అబ్బబ్బా..ఏం జాక్ పాట్ ఆఫర్ కొట్టరు...

అప్పుడు కాజల్.. ఇప్పుడు రష్మిక.. అబ్బబ్బా..ఏం జాక్ పాట్ ఆఫర్ కొట్టరు గురూ..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం కాదు ..వచ్చిన తర్వాత తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ఈరోజుల్లో తమ కంటూ సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడమే ఇంపార్టెంట్. ఇండస్ట్రీలోకి వచ్చిన ఇంతమంది హీరోయిన్స్ ఆ గోల్ రీచ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది . గ్లామర్ రోల్స్ కే పరిమితమైన హీరోయిన్స్ తాము నచ్చిన నమ్మిన కథను రావాలి అంటే కచ్చితంగా దశాబ్ద కాలం పడుతుంది.

అయితే ఆ పని రష్మిక కు చాలా సులువుగా అయిపోయింది. ప్రెసెంట్ ఇండస్ట్రీలో రష్మిక మందన క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకొని నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది. మధ్యలో కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ వచ్చిన రష్మిక మాత్రం ఎక్కడ తన క్రేజ్ ని తగ్గించుకోలేదు . ఈ క్రమంలోనే ప్రజెంట్ బాలీవుడ్ లో రెండు ఫ్లాపులు పడిన సరే మరింతగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది . ఈ క్రమంలోని రష్మిక కెరియర్ లో స్పెషల్ రోల్ చేయబోతున్నట్టు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఎస్ ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ లోనే మెప్పించిన రష్మిక త్వరలోనే మహారాణి అవతారం ఎత్తబోతున్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది .

మరాఠీ యోధుడు మరాఠీ రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ కోడలుగా నటించబోతుందట రష్మిక. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన పెద్ద కుమారుడు శభోజి బోన్స్లే జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కపోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది , ఈ పిరియాడికల్ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి . అంతేకాదు ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ యంగ్ హీరో విక్క కౌశల్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఆయన భార్య పాత్రలో మహారాణి ఏసు భాయ్ బోన్స్లే పాత్రలో రష్మిక మందన్నా నటించబోతున్నట్లు సమాచారం అందుతుంది .

ఈ రోల్ కోసం ఎంతోమంది హీరోయిన్స్ ని ట్రై చేసిన సరే ..ఫైనలి రష్మికను చూస్ చేసుకున్నారట డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్. ఈ క్రమంలోనే ఒకప్పుడు మగధీర సినిమాల్లో మిత్రవింద పాత్ర చేసిన తన కోరిక తీర్చుకున్న కాజల్ లాంటి లక్కీ ఛాన్స్ కొట్టేసింది రష్మిక అంటూ అభిమానులు సంబరపడుతున్నారు . అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇలాంటి ఓ గట్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం నిజంగా రష్మిక మందన లెక్ అనే చెప్పాలి. చూద్దాం.. ఈ పాత్రలో రష్మిక ఎలా మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news