Moviesతండ్రి రూమ‌ర్డ్ ప్రియురాలు అనుష్క‌తో నాగ‌చైత‌న్య ప్రేమాయ‌ణం… పెళ్లి కూడా…!

తండ్రి రూమ‌ర్డ్ ప్రియురాలు అనుష్క‌తో నాగ‌చైత‌న్య ప్రేమాయ‌ణం… పెళ్లి కూడా…!

కన్నడ కస్తూరి, టాలీవుడ్ స్వీట్ బ్యూటీ అనుష్క వయసు 40 + దాటేసింది. ఇప్పుడు కూడా ఆమె తెలుగులో తనకంటే చిన్నోడు అయినా నవీన్ పోలిశెట్టి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. 40 దాటుతున్న.. ముదురు ముద్దుగుమ్మ అయినా కూడా పెళ్లి విషయంలో అనుష్క ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పటం లేదు. ఇప్పటికే అనుష్క పై ఎన్నో పెళ్లి వార్తలు వినిపించినా.. అవేవీ నిజం కాలేదు.

ముఖ్యంగా అనుష్కకు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు మధ్య రామాయణం నడుస్తుందని.. అందుకే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదని.. భవిష్యత్తులో ఎప్పటికి అయినా వీరిద్దరు పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అవటం కన్ఫామ్ అంటూ ఒకటే చర్చలు నడుస్తున్నాయి. అసలు సోషల్ మీడియాలో అయితే అనుష్క – ప్రభాస్ కి కొన్ని వందలసార్లు పెళ్లిళ్లు జరిగాయి.

వీరిద్దరి మధ్య మిర్చి సినిమా హిట్ అయ్యాక ప్రేమ చిగురించింది అని.. బాహుబలి సినిమా చేసే టైంలో ఈ ప్రేమ మరింత బలపడిందన్న టాలీవుడ్ లో ఉన్నాయి. అయితే అనుష్క – ప్రభాస్ కంటే ముందే టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో కూడా ప్రేమలో పడిందని వార్తలు వినిపించాయి. నాగార్జున – అనుష్క కాంబినేషన్ అంటే వెండితెరకు ఒక క్రేజ్. వీరిద్దరూ కలిసి డాన్ – ఢ‌మరుకం – నమో వెంకటేశాయఃతో పాటు సినిమాలలో నటించారు.

అయితే అనుష్క‌.. ప్ర‌భాస్‌తో ప్రేమ‌లో ప‌డ‌డానికి ముందే నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌లో ప‌డింద‌ని.. వీరిద్ద‌రు త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని.. వీరి ప్రేమ‌కు నాగార్జున కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చార‌ని వార్తలు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌లు ఏకంగా సోష‌ల్ మీడియాలో కాకుండా.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వ‌చ్చేశాయి. దీంతో నిజంగానే వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నారా ? అనుష్క నాగార్జున ఇంటి కోడ‌లు అవుతుందా ? అని ఒక్క‌టే గుస‌గుస‌లు వినిపించాయి.

అయితే ఇదంతా అబ‌ద్ధం మాత్ర‌మే. అప్ప‌ట్లో ఆంధ్ర‌జ్యోతి లాంటి పాపుల‌ర్ దినప‌త్రిక‌లోనే ఈ వార్తలు వ‌చ్చాయి. నాగార్జున ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పాటు ఇంత పెద్ద ప‌త్రిక ఇలా రాయ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో ఆంధ్ర‌జ్యోతి యాజ‌మాన్యం నాగార్జున‌కు స్వ‌యంగా క్ష‌మాప‌ణ చెప్పింది. అప్ప‌ట్లో ఈ వార్త ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news