MoviesUpasana లీకైన ఉపాసన డెలివరీ డేట్.. చిరంజీవి ప్రిడిక్షన్ నే నిజమైందిగా..?

Upasana లీకైన ఉపాసన డెలివరీ డేట్.. చిరంజీవి ప్రిడిక్షన్ నే నిజమైందిగా..?

వావ్ ..నిజంగా ఇది మెగా అభిమానులకు పండగ లాంటి ఓ న్యూస్ అని చెప్పాలి. ఇన్నాళ్లు మెగా కోడలు ఉపాసన ఎప్పుడు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతుందా అంటూ కళ్ళు కాయలు కాచేలా మెగా అభిమానులు , ఉపాసన ఫ్రెండ్స్ , రాంచరణ్ ఫ్రెండ్స్ ఎంతో ఆతృతగ వెయిట్ చేశారు . మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతుంది అంటూ ఆనందంతో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి మెగా కోడలు ఉపాసనకు సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

ఓ సారి సరోగసి ద్వారా బిడ్డకు జన్మనివ్వబోతుందని..మరోసారి కవల పిల్లలు అని.. ఇలా నానా రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. రీసెంట్గా ఆమె డెలివరీ అమెరికాలో జరగబోతుంది అంటూ కూడా గాసిప్ లు వినిపించాయి. అయితే అదంతా ఫేక్ అంటూ తన డెలివరి ఇండియాలోనే జరగబోతుంది.. అది కూడా అపోలో హాస్పిటల్స్ లోనే జరుగుతుంది అంటూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చింది . కాగా రీసెంట్ గా మరో న్యూస్ వైరల్ అవుతుంది.

ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియగానే చాలామంది చిరంజీవి పుట్టినరోజు నాడే మెగా వారసుడు పుడితే బాగుంటుంది అని అనుకున్నారు. చిరంజీవి సైతం ఇదే కోరికను కోరుకున్నారు . అయితే దేవుడు చిరంజీవి మొరను ఆలకించారు. అందుకే ఉపాసన డెలివరీ డేట్ ఆగస్టు 20 కి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ ఆ డేట్ రెండు వాయిదా పడి ఆగస్టు 22న పుడితే మాత్రం తాత మనవడు ఒకేరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటారు అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఉపాసనకి సంబంధించిన డెలివరీ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news