MoviesANR-Jamuna ఆ ఒక్క మాటతో రగిలిపోయే.. ఏఎన్నార్ జమునని తొక్కేశారా..?

ANR-Jamuna ఆ ఒక్క మాటతో రగిలిపోయే.. ఏఎన్నార్ జమునని తొక్కేశారా..?

సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్ల‌ మ‌ధ్య ఇగోలు, పంతాలు, ప‌ట్టింపులు వ‌స్తూ వుంటాయి.1960 – 1970 ద‌శ‌కంలోను కొంద‌రు స్టార్ హీరోలు, హీరోయిన్ల‌ మ‌ధ్య పంతాలు, ప‌ట్టింపులు న‌డిచేవి. ఈ క్ర‌మంలోనే అలనాటి మేటి దివంగ‌త న‌టి జ‌మున హీరోల‌కు తాను ఏమీ త‌క్కువ కాదు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించేవారు.
జ‌మున ప్ర‌వ‌ర్త‌న దివంగ‌త న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావును ఒక సంద‌ర్బంలో బాగా హ‌ర్ట్ చేసింది అట‌.
జమున అటు వైపు ఎంత స్టార్ హీరో ఉన్నా… త‌న దారి లో తాను వెళ్ళి పోయేవారు.

ఓ సంద‌ర్బంలో ఆమె నేరుగా ఏఎన్ఆర్ ద‌గ్గ‌ర కు వెళ్ళి సెట్స్ లో మీ ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల నేను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను.. మీరు మీ ప్ర‌వ‌ర్త‌న మార్చుకుంటే బాగుంటుంద‌ని నేను అనుకుంటున్నాను.. మీరు ఎలా ఉన్నా మీ ఇష్టం అని నేరుగా చెప్పేశార‌ట‌. జ‌మున అలా అన‌టంతో ఏఎన్ఆర్ తీవ్రంగా హ‌ర్ట్ అయార‌ట‌. ఒక స్టార్ హీరోగా ఉన్న త‌న‌నే ప్ర‌వ‌ర్త‌న మార్చుకోమ‌ని చెప్తుందా అందరి ముందు అని.. మ‌నో వేద‌న‌కు గుర‌య్యార‌ట‌. వెంట‌నే ఏఎన్ఆర్ జ‌మునపై క‌క్ష క‌ట్టి ఆమెకు సినిమాల‌లో ఛాన్సులు రాకుండా చేయ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌.

అక్క‌డి తో ఆగ‌ని ఏఎన్ఆర్.. ఎన్టీఆర్ కు ఫోన్ చేసి బ్ర‌ద‌ర్ జ‌మున చాలా పొగ‌రుబోతు.. ఆమె కు తోటి హీరో ల‌ను గౌర‌వించ‌డం కూడ తెలియ‌దు.. ఆమె చాలా ఆహంకారి.. ఆమె. కు మీ సినిమాల‌లో ఛాన్స్ లు ఇవ్వొద‌ని చెప్పార‌ట‌. ఇటు జ‌మునను త‌న‌తో సినిమాలు తీసే నిర్మాత‌ల‌తో చెప్పి బ్యాన్ చేయించ‌డంతో పాటు… అటు ఎన్టీఆర్ సినిమాల‌లో కూడా ఛాన్స్ రాకుండా బ్యాన్ చేయించ‌డంతో మూడు సంవ‌త్స‌రాలు పాటు ఆమెకు అగ్రహీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాల‌లో ఆవ‌కాశాలు రాలేదు.

అయితే జ‌మున అదే టైమ్ లో బాలీవుడ్ లోకి ఎంట‌ర్ అయి అక్క‌డ వ‌రుస‌గా సూప‌ర్ హిట్లు కొట్టారు. జ‌మునలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ న‌ర్గీస్ ఫేస్ క‌ట్స్ ఉన్నాయి అన్న టాక్ బాలీవుడ్ లో రావ‌డంతో జ‌మున అక్క‌డ బాగా క్లిక్ అయారు. అదే టైమ్ లో తెలుగులో కొత్తత‌రం హీరోలు కృష్ణ , శోభ‌న్ బాబు లాంటి వారు రావ‌డంతో వాళ్ళ ప‌క్క‌న హీరోయిన్ గా న‌ట్టించే ఛాన్స్ కొట్టేసారు. దీంతో ఏఎన్ఆర్ , ఎన్టీఆర్ త‌న‌ను బ్యాన్ చేసినా జ‌మునకు ఎదురు లేకుండ పోయింది.

చ‌క్ర‌పాణి, నాగిరెడ్డి ఏఎన్ఆర్, ఎన్టీఆర్ తో క‌లిసి మాయా బ‌జార్ సినిమా తీయాల‌నుకున్న‌ప్పుడు ముందు గానే ఎన్ట్ఆర్, సావిత్రి – ఏఎన్ఆర్, జ‌మున జంటల‌ను ఫిక్స్ చేసారు. అయితే జ‌మున త‌న‌ను ఎన్టీఆర్, ఏఎన్ఆర్ బ్యాన్ చేసారన్న విష‌యాన్ని చ‌క్ర‌పాణి, నాగిరెడ్డిల‌కు చెప్పారు.అప్పుడు చ‌క్ర‌పాణి, నాగిరెడ్డి ఏఎన్నార్ – ఎన్టీఆర్ ల‌ను పిలిచి మీరు జ‌మునను బ్యాన్ చేయ‌డం స‌రికాద‌ని స‌ర్ది చెప్పారంట. అలా అప్ప‌టి నుంచి జ‌మున మ‌ళ్లీ ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో న‌టించ‌డం మొద‌లు పెట్టారు. ఆ వెంట‌నే ఎన్టీఆర్ జ‌మునకు త‌న సొంత సినిమా గులేభ‌కావ‌ళి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అలా అప‌ట్లో ఏఎన్ఆర్ జ‌మునను బ్యాన్ చేయ‌టం పెద్ద సంచ‌ల‌నం అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news