MoviesBalayya చనిపోయిన తారకరత్నను బ్రతికిస్తున్న బాలకృష్ణ నిర్ణయం.. నందమూరి ఫ్యామిలీలోనే ఇది...

Balayya చనిపోయిన తారకరత్నను బ్రతికిస్తున్న బాలకృష్ణ నిర్ణయం.. నందమూరి ఫ్యామిలీలోనే ఇది మరో సంచలనం..!!

మనకు తెలిసిందే. రీసెంట్ గా నందమూరి హీరో తారకరత్న గుండెపోటుతో మరణించారు . కాగా సుదీర్ఘంగా 23 రోజులపాటు మరణంతో పోరాడిన నందమూరి తారక రత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఈ ఊహించని పరిణామంతో నందమూరి ఫ్యాన్స్ నందమూరి కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు . నందమూరి తారకరత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లడం అభిమానులకు తీరని శోకాని మిగిల్చింది.

కాగా ఇన్నాళ్లు ఆఫర్స్ లేక ఇబ్బంది పడిన తారకరత్నకు ఇప్పుడిప్పుడే ఆఫర్లు వస్తున్నాయి . ఇప్పటికే ప్రభాస్ కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే లో కూడా స్పెషల్ రోల్ కి సెలక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఎన్బికె 108 సినిమా పేరుతో వస్తున్న అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలోను నందమూరి బాలయ్య ..నందమూరి తారకరత్నకు స్పెషల్ రోల్ డిజైన్ చేశారట.

కానీ ఈలోపే నందమూరి తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు . అయితే చనిపోయిన కానీ తారకరత్నను ఈ సినిమాలో నటింపజేయాలి అన్న ఉద్దేశంతో బాలకృష్ణ విఎఫెక్స్ ఎఫెక్ట్స్ ద్వారా సినిమాల్లో నందమూరి తారకరత్న ను తెర పై చూపించబోతున్నారట. గతంలో యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సీనియర్ ఎన్టీఆర్ని ఎలా చూపించారో..రాజమౌళి.. సేమ్ ఇదేవిధంగా అనిల్ రావిపూడి కూడా చనిపోయిన తారకరత్నను ఎన్బికె 108 సినిమాలో బ్రతికి చూపించే విధంగా సెట్ చేస్తున్నారట. ఈ న్యూస్ తో నందమూరి తారకరత్న ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు నందమూరి హీరోలకే ఇది సాధ్యం అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news