Moviesపెళ్ళైన హీరో భార్య పై మోజు పడ్డ రానా..? దగ్గుబాటి...

పెళ్ళైన హీరో భార్య పై మోజు పడ్డ రానా..? దగ్గుబాటి ఫ్యామిలీ అంత ఇంతేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు. అలా జరిగిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి . స్టార్ హీరోగా ఉన్న నటుడు జీరో అయిపోవడం ..రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటుంది . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఉండిపోవాలని.. హీరోగా రాజ్యమేలేయాలని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు చివరికి విలన్ గా, ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేసుకుంటూ జీవనం కొనసాగించడం చేస్తుంటారు. అదే లిస్టులోకి వస్తాడు టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న రానా దగ్గుబాటి .

లీడర్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రానా.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేశాడు. అయితే హీరోగా కన్నా విలన్ గానే సక్సెస్ అందుకున్నాడు. భీమ్లా నాయక్ – బాహుబలి సినిమాలు హిట్ అవ్వడానికి మెయిన్ కారణం విలన్ పాత్రలు అన్న సంగతి అందరికీ తెలిసిందే . హీరోల పాత్రలకు ప్రాణం పోసే విధంగా విలన్ పాత్రల్లో నటిస్తాడు రానా దగ్గుబాటి . కాగా గతంలో రానా దగ్గుబాటి ఓ యంగ్ హీరోయిన్ ని ప్రేమించాడు అని ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా రానా దగ్గుబాటి తనతో వర్క్ చేసిన స్టార్ హీరోయిన్ ని కూడా ఇష్టపడ్డారు అన్న న్యూస్ అప్పట్లో వైరల్ అయింది. ఆ స్టార్ హీరోయిన్ కి ఆల్రెడీ బాలీవుడ్ హీరో తో పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని గ్తెలిసినా.. ఇష్టం చంపుకోలేకపోయాడని అందుకే.. తన సినిమాలో హీరోయిన్గా పెట్టుకున్నాడు అన్న న్యూస్ అప్పట్లో ఓ రేంజ్ లో వైరల్ అయింది . అయితే ఆ తర్వాత హీరోయిన్ ..రానా దూరం దూరంగా ఉండటంతో ఆ వార్తలు కనుమరుగైపోయాయి .

కేవలం రానానే కాదు ఇండస్ట్రీలో కి ఇప్పుడిప్పుడే వస్తున్న అభిరామ్ కి సంబంధించి కూడా ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు అప్పట్లో వెంకటేష్ – సౌందర్య మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ సినీ ఇండస్ట్రీ కూడా కోడైకూసింది. ఆ తర్వాత ఆ వార్తలు అలా అలా గాల్లో తేలిపోయాయి.. ఏంటో దగ్గుబాటి ఫ్యామిలీకేకి ఎందుకు ఇలా జరుగుతుందో ..? ఎఫైర్లు ఉన్నా లేకపోయినా ఈ రూమర్లతో మాత్రం దగ్గుబాటి హీరోల పేర్లు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news