Moviesవాట్..శ్రీజ కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోలేదా..? కొత్త డౌట్లు పుట్టిస్తున్న...

వాట్..శ్రీజ కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోలేదా..? కొత్త డౌట్లు పుట్టిస్తున్న మెగా డాటర్ కామెంట్స్..!

ఇది నిజంగా మెగా అభిమానులకి బిగ్ కన్ఫ్యూషన్ అని చెప్పాలి . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్కి గురైన శ్రీజ ఇప్పుడు సడన్గా ప్లేట్లు మార్చినట్లు మాట్లాడిందా..? లేక ఆమె మాట్లాడిన మాటలు మనం తప్పుగా అర్థం చేసుకున్నామా..? అనే కన్ఫ్యూషన్ లో ఉండిపోయారు జనాలు. మరీ ముఖ్యంగా శ్రీజ పేరు సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ గురైందో మనం చూసాం . దానికి కారణం కూడా మనకి తెలుసు . రెండు సార్లు విడాకులు తీసుకుంది అంటూ చాలా వెటకారంగా వ్యంగ్యంగా ట్రోల్ చేశారు.

అయితే తాజాగా ఒక అమ్మాయి తన భర్తకు విడాకులు ఇవ్వాలా..? వద్దా..? అంటూ శ్రీజను సలహా అడిగింది . శ్రీజ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చింది. ” మీరు అతనితో సంతోషంగా ఉంటే ఉండండి ..లేదంటే మీకు మీరే నిర్ణయం తీసుకోండి” అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు ఆ తర్వాత ఆమె డివర్స్ పై స్పందిస్తూ..” ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ..బబుల్ బాత్ చేయడం ..స్పాకి వెళ్లడం ..మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవడం ..మేకప్ వేసుకోవడం ..అందంగా తయారవడం ఇష్టం వచ్చినట్లు మనం బ్రతకడం అనేది సెల్ఫ్ లవ్ కదా ..?”

“సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్ మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము.. ధైర్యం మనకుంటే మనల్ని ఎవరు ఆపుతారు ..? ఆ దమ్ము ధైర్యం మీకుందా..? అంటూ ప్రశ్నించింది”. దీంతో ఒక్కసారిగా శ్రీజ విడాకుల మేటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలు ఈమె విడాకులు తీసుకున్నట్లు లేదు. ఆమె ప్రవర్తన నచ్చక కళ్యాణ్ దేవ్ దూరం పెట్టినట్లు ఉన్నాడు. కళ్యాణ్ దేవ్ ని ఇంకా శ్రీజ ఇష్టపడుతున్నట్లే ఉంది . వీళ్ళు విడాకులు తీసుకున్నట్లు ఎక్కడ కూడా అఫీషియల్ ప్రకటన చేయలేదు అంటూ మెగా ఫాన్స్ చర్చించుకుంటున్నారు. అసలు శ్రీజ విడాకులు తీసుకుందా..? తీసుకోలేదు అనేది ఇప్పుడు పెద్ద కన్ఫ్యూషన్ గా మారిపోయింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news