MoviesYasaswi "బుద్ది లేక అలా చేసా..క్షమించండి".. పాపం యశస్వి దూల తీర్చేసారుగా..!!

Yasaswi “బుద్ది లేక అలా చేసా..క్షమించండి”.. పాపం యశస్వి దూల తీర్చేసారుగా..!!

ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడే నెగెటివిటీ ఉంటుంది.. ఎక్కడ పొగిడే జనాలు ఉంటారో.. అక్కడే తిట్టే జనాలు ఉంటారు . మన ముందు ఓ మనిషి పైకి ఎక్కుతూ ఉంటే చూసి ఓర్వలేరు కొందరు జనాలు .. అలాంటప్పుడే అలాంటి పర్సన్ ని ఏదో ఒక విధంగా బ్యాడ్ చేసి డౌన్ చేయాలని చూస్తూ ఉంటారు . ఈ మధ్యకాలంలో అలాంటివి మనం చాలా చూస్తూనే ఉన్నాం కదా.. రీసెంట్గా సరిగమప టైటిల్ విన్నర్ యశస్వి కొండేపూడి కూడా అలాంటి సిచువేషన్ నే ఫేస్ చేస్తున్నారు.

మనకు తెలిసిందే సరిగమప ద్వార తనలోని టాలెంట్ను బయట పెడుతూ పాపులారిటీ సంపాదించుకున్న యశస్వి కొండేపూడి .. ప్రజెంట్ ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాడు . కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ లో ఉంటున్న పిల్లలతో ఫోటోలు దిగి .. అది తనే నడుపుతున్నానని.. ఆ పిల్లల మంచి చెడులు తానే చూసుకుంటున్నట్లు రీసెంట్గా ఈవెంట్ లో చెప్పుకొచ్చారు . దీంతో ఒక్కసారిగా ఆయన పై నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

యువసేన ఫౌండేషన్ నిర్వాహకురాలు ఫరా కౌసర్.. యశస్వి పై మండిపడ్డాడు . “అతడు నవసేన ఫౌండేషన్ కి ఎలాంటి హెల్ప్ చేయలేదని .. ఆ పిల్లల బాధ్యతలు నేనే దగ్గరుండి నా సొంత డబ్బులతో చూసుకుంటున్నాను .. అంతేకాదు యశస్వి అబద్ధాలు చెబుతున్నాడు ” అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు . ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు . కాగా దీంతో సోషల్ మీడియాలో యశస్విని కొందరు టార్గెట్ చేసి ట్రోల్ చేశారు .

ఈ క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూలో యశస్వి కొండేపూడి తనపై వచ్చిన నిందలకు క్లారిటీ ఇచ్చాడు . “ఫౌండేషన్ బాధ్యతలు నేను తీసుకున్నానని.. అది నాదే అని.. నేను ఎక్కడా చెప్పలేదు ..నాకు ఈ ఫౌండేషన్కు అసలు ఏ సంబంధం లేదు.. సాధ్య ఫౌండేషన్కు మేమంతా సహాయం చేస్తూ ఉంటాము ..ఈ ఫౌండేషన్ తమకు నచ్చిన మరి కొన్ని సంస్థలకు చేయూత అందిస్తూ ఉంది ..ఈ క్రమంలోనే నవసేన ఫౌండేషన్ వాళ్లతో ఆల్ ద బెస్ట్ చెప్పించుకున్నానని .. అంతే తప్పిస్తే ఇందులో వేరే అర్థం ఏమి లేదంటూ చెప్పుకోవచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోస్ కూడా చూపించాడు. బుద్ది లేక ఆ వీడియో చూపించానని..ఇక పై అలాంటి తప్పు చేయనని చెప్పుకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news