MoviesAmigos First Day Collections : ఇంత దారుణంగా ఉన్నాయి ఎంట్రా...

Amigos First Day Collections : ఇంత దారుణంగా ఉన్నాయి ఎంట్రా బాబు.. కల్యాణ్ రామ్ ఎలా తట్టుకుంటాడో..?

టాలీవుడ్ నందమూరి హీరోగా పేరు సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం అమిగోస్. కొత్త దర్శకుడు రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . కాగా మొదటి షో తోనే మంచి విజయాన్ని మంచి టాక్ ని అందుకున్న ఈ చిత్రం అభిమానులకుతెగ నచ్చేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఫస్ట్ టైం నందమూరి హీరో ట్రిపుల్ రోల్ లో కనిపించడం సినిమాకి హైలైట్ గా మారింది.

కాగా ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని కంటెంట్ ని తెరపై చూపించడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు . మరి ముఖ్యంగా సినిమాలో మైఖేల్ పాత్రలో నటించిన నందమూరి హీరోనే అందరికీ నచ్చాడు. సిద్ధార్ధ్ పాత్రలో నాటీగా కనిపించిన అందరికీ మైకేల్ క్యారెక్టర్ నే తెగ నచ్చేసింది. సినిమాను ఆశిక రంగనాథ్ అందాలు మరో మెట్టు ఎక్కించాయనే చెప్పాలి. ఫస్ట్ టైం తెలుగు తెరపై నటిస్తున్నా కానీ ఎక్కడ భయం లేకుండా నందమూరి హీరో తో కలిసి రొమాన్స్ చేసిన పద్ధతి అభిమానులకు తెగ నచ్చేసింది .

ఇలాంటి క్రమంలోనే సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందా అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేశారు . అయితే నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లోని అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా బింబిసారా రికార్డ్ నెలకొల్పింది. ఆ సినిమాతో కంపేర్ చేస్తే అమిగోస్ కూసింత తగ్గిందనే చెప్పాలి. కళ్యాణ్ రామ్ గత చిత్రం బింబిసారా ఓపినింగ్ రోజు షేర్ 7.2 కోట్లు వచ్చింది. అయితే అమిగో చిత్రం ఆ స్దాయి ఓపినింగ్స్ ని తెచ్చుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మొదటి రోజు అమిగోస్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 3.5 కోట్ల గ్రాస్ వచ్చినట్టు సమాచారం ..ఈ రకంగా చూసుకుంటే కళ్యాణ్ రామ్ అమిగోస్ తో కూసింత నిరాసపరిచిందనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news