Moviesమెగా వారసుడు మరో క్రేజీ రికార్ట్..తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించిన...

మెగా వారసుడు మరో క్రేజీ రికార్ట్..తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించిన రామ్ చరణ్..!!

ఇది నిజంగా మెగా అభిమానులకి పండగ చేసుకునే వార్త అనే చెప్పాలి . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘణత సాధించారు . ఇప్పటివరకు తెలుగులో ఏ హీరో సృష్టించిన చరిత్రను సృష్టించి.. ఇండియన్ సినిమా రికార్డును తిరగ రాశాడు. మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్గా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ . రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్ట్ చేసింది రాజమౌళి .

ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడు . ఆయనే మన తారక్ . ఇద్దరు హీరోలతో మల్టీ స్టార్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ దేశాలను ఓ ఊపు ఊపేస్తుంది. రీసెంట్గా ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయింది . కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంటుంది అంటూ తెలుగు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు . దీని కోసమే హాలీవుడ్ రేంజ్ లో సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నారు . కాగా రామ్ చరణ్ ప్రమోషన్స్ లో భాగంగా హాలీవుడ్ మీడియాను ఆకట్టుకుంటున్నారు .

ఈ క్రమంలోనే రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు అమెరికాకు చేరింది . ప్రపంచ ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం గుడ్ మార్నింగ్ కి అమెరికా నుంచి చరణ్ కి ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 22న ఈ టీవీ షోలో రామ్ చరణ్ సందడి చేయరున్నారు . గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు . అంతేకాదు ఈ ఘనత అందుకున్న తెలుగు తెలుగు హీరో కూడా రాంచరణ్ అవ్వడం గమనార్హం. అమెరికాలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ షోస్ స్ట్రీమింగ్ కానుంది ..మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే నైట్ 11:30 నిమిషాలకు ఈ గుడ్ మార్నింగ్ అమెరికా రామ్ చరణ్ ఏపిసోడ్ టెలికాస్ట్ కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో చిరంజీవి పుత్రోత్సాహం డబల్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news