MoviesPawan Kalyan పవన్ కళ్యాణ్ సినిమాలో నయనతార .. ఏంటి ..అలా...

Pawan Kalyan పవన్ కళ్యాణ్ సినిమాలో నయనతార .. ఏంటి ..అలా ఆ కోరిక తీర్చుకుంటున్నాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి జోరు మీద కనిపిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలతో పాటు రాజకీయాలలో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. రీసెంట్గా మరో కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు . రవితేజ శంభో శివ శంభో సినిమా డైరెక్టర్ చేసిన సముద్రఖని .. డైరెక్షన్లో ఓ సినిమాని అనౌన్స్ చేసాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు .

దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది . ఈరోజు హైదరాబాద్లో ఈ సినిమా షూట్ స్టార్ట్ అయింది . దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే క్రమంలో తాగా ఈ ప్రారంభోత్సవంలో మామ అల్లుళ్ళు ఇద్దరు బ్లాక్ డ్రెస్సులో కనిపించి అభిమానులకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిన వినోదయ సీతయం సినిమాకి రీమేక్ గా వస్తున్నట్లు తెలుస్తుంది . కాగా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయిన కుర్రాడిగా .. పవన్ కళ్యాణ్ కృష్ణుడి రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ తెలుస్తుంది .

అయితే ఈ సినిమాలో మరో కీలకపాత్రలో కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమాలో తెలుగులో ఈ పాత్ర ని స్పెషల్ గా డిజైన్ చేశారని . ఆ పాత్ర కోసమే నయనతారను ఫిక్స్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు నయనతార భర్త డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారట.. కానీ అవకాశం రాలేదు . కనీసం భార్యతో అయినా ఇలా నటింపజేసి,, తన కోరిక నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వెయిట్ చేస్తున్న క్రేజీ కాంబో సెట్ అయింది.. పవన్ కళ్యాణ్ సినిమాలో నయన్ కనిపిస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news