Moviesపార్ట్ 2లో న‌వ్వులే న‌వ్వులు... ఆ ఒక్క సీన్‌తో ప్ర‌భాస్‌ను భ‌య‌పెట్టిన...

పార్ట్ 2లో న‌వ్వులే న‌వ్వులు… ఆ ఒక్క సీన్‌తో ప్ర‌భాస్‌ను భ‌య‌పెట్టిన బాల‌య్య‌…!

నంద‌మూరి బాల‌కృష్ణ చేస్తోన్న అన్‌స్టాప‌బుల్ టాక్ షో సెకండ్ సీజ‌న్ కూడా గ్రాండ్ స‌క్సెస్‌గా దూసుకుపోతోంది. సెకండ్ సీజ‌న్లో వ‌చ్చిన ఎపిసోడ్లు కూడా బాగా పేలుతున్నాయి. గ‌త వారం బాహుబ‌లి ఎపిసోడ్ పార్ట్ 1 బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఎపిసోడ్లో ప్ర‌భాస్‌, బాల‌య్య క‌లిసి చేసిన సంద‌డి రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. ఇండియ‌న్ ఓటీటీ చ‌రిత్ర‌లోనే త‌క్కువ టైంలో 50 మిలియ‌న్ల మినిట్స్ , 100 మిలియ‌న్ల మినిట్స్ స్ట్రీమింగ్ అయిన షోగా ఈ ఎపిసోడ్ రికార్డులు బ్రేక్ చేసింది.

ఈ బాహుబ‌లి పార్ట్ 1 ఎపిసోడ్ సెన్షేష‌న‌ల్ వ్యూస్ రాబ‌ట్టింది. తాజాగా ఈ రోజు బాహుబ‌లి పార్ట్ 2 ఎపిసోడ్ రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్లో బాల‌య్య‌, ప్ర‌భాస్‌, గోపీచంద్ క‌లిసి చేసిన ఫ‌న్ అయితే వ్యూవ‌ర్స్‌ను బాగా ఆక‌ట్టుకుంది. అస‌లు ఫ‌స్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌లో అయితే ఫ‌న్ అదిరిపోయింది. ఫ‌స్ట్ పార్ట్‌లో త‌గ్గిన ఫ‌న్‌ను సెకండ్ పార్ట్‌లో పెంచేశారు.

విచిత్రం ఏంటంటే బాల‌య్య ప్ర‌భాస్‌ను ఆటాడుకోగా.. ఇటు గోపీచంద్ కూడా బాల‌య్య‌కు తోడుగా ప్ర‌భాస్‌ను మ‌రింత‌గా ఆడేసుకున్నాడు. ఇద్ద‌రు హీరోల మ‌ధ్య అస్స‌లు ఇగో లేకుండా ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా ? అనేలా గోపీచంద్‌, ప్ర‌భాస్ ఉన్నారు. ఇక రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భాస్ కాస్త ఎమోష‌న‌ల్ కాగా, అక్క‌డ ఉన్న ఆడియెన్స్ కూడా సైలెంట్ అయ్యారు.

అయితే ఎడిట్ చేసిన ఓ ఫొటో వేయ‌డంతో ఆ ఫొటో చూసి ప్ర‌భాస్ ఒక్క‌సారిగా కంగారు ప‌డ్డాడు. ప్ర‌భాస్ పెళ్లి గెట‌ప్‌లో ఆ అమ్మాయిని హ‌గ్ చేసుకుంటున్న‌ట్టుగా ఉంది. ఆ ఫొటో చూసిన ప్ర‌భాస్ ఆ అమ్మాయి ఎవ‌రో చెప్పండి సార్ లేదంటే మా అమ్మ కంగారు ప‌డుతుంద‌ని న‌వ్వించాడు. అనుష్క‌, కృతిస‌న‌న్ ఫొటోలు చూసిన‌ప్పుడు మాత్రం ప్ర‌భాస్ ఎక్స్‌ప్రెష‌న్స్ చూస్తే ఎంత ? క్యూట్‌గా ఉన్నాడ్రా బాబు అనిపించ‌క మాన‌దు.

ఓవ‌రాల్‌గా ఫ‌న్‌, ఎమోష‌న‌ల్‌, ఫ్రెండ్లీత‌నం ఇలా అన్ని క‌లగ‌లుపుతూ బాహుబ‌లి పార్ట్ 2ను గ్రాండ్ స‌క్సెస్ చేయ‌డంలో బాల‌య్య‌, ప్ర‌భాస్‌, గోపీచంద్ ముగ్గురు త‌మ వంతు పాత్ర పోషించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news