Moviesతెలుగు పరువుని చెన్నై లో ఇంగ్లీష్ భాష లో తీసేసిన దిల్...

తెలుగు పరువుని చెన్నై లో ఇంగ్లీష్ భాష లో తీసేసిన దిల్ రాజు.. “ఎన్నడా స్పీచ్ రా అది”..!!

దిల్ రాజు.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . డిస్ట్రీబ్యూటర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసిన దిల్ రాజు.. ప్రజెంట్ టాలీవుడ్ లో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవ్వాలి.. ఓటిటిలో ఏ తేదీన రిలీజ్ అవ్వాలి అని చెప్పే స్థాయికి ఎదిగిపోయాడు . టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ట్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకుని రాజ్యమేలుస్తున్న దిల్ రాజు.. ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా రారాజుగా రాజ్యాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అయితే సంక్రాంతి కానుకగా తాను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా వారసుడు.. జనవరి 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది . కాగా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. కాగా ఆ ఈవెంట్లో నిర్మాతగా ఉన్న దిల్ రాజు .. వేదికపై కి వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. కాగా సాధారణంగా ఇప్పటివరకు తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్లకు, ఈవెంట్లకు అటెండ్ అయిన దిల్ రాజుకు భాష ప్రాబ్లం రాలేదు. ఫస్ట్ టైం తమిళ గడ్డపై మాట్లాడడానికి దిల్ రాజు భాష అడ్డొచ్చింది. దిల్ రాజుకు తెలుగు తప్పితే మిగతా భాషలు రావు .

ఇంగ్లీష్ కొంచెం వచ్చినా తమిళ్ బాష శూన్యం . దీంతో వచ్చి రాని ఇంగ్లీషులో మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. తమిళ్ గడ్డపై తమిళ్ ఇంగ్లీష్ భాషలను కలుపుతూ మాట్లాడిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు ఎప్పుడెప్పుడు స్టార్ సెలబ్రెటీస్ ని ట్రోల్ చేస్తామా..? అంటూ ఈగర్ గా వెయిట్ చేసే ట్రోలర్స్ కు మంచి మెటీరియల్ ఇచ్చాడు దిల్ రాజు. ఈ క్రమంలోని వచ్చిరాని తమిళ్ ఇంగ్లీష్ తో మాట్లాడిన దిల్ రాజు స్పీచ్ వైరల్ అవుతుంది. దీంతో ఆయనని ట్రోల్ చేస్తున్నారు జనాలు . ఎవరైనా సరే వీడియో ఆన్ చేసిన ఒక్క నిమిషంలోనే పడి పడి నవ్వుకుంటారు.. ఎందుకంటే ఆ స్పీచ్ అంత ఫన్నీగా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news