Moviesత‌మ‌న్నాను ఐటెం గ‌ర్ల్‌గా మార్చేస్తోన్న త్రివిక్ర‌మ్‌...!

త‌మ‌న్నాను ఐటెం గ‌ర్ల్‌గా మార్చేస్తోన్న త్రివిక్ర‌మ్‌…!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీకొచ్చి పదిహేనేళ్ళు దాటింది. ఇన్నేళ్ళలో ఎక్కువగా బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఒకదశలో తమన్నా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ కూడా తీసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్మ్ చరణ్..ఇలా టాలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతోనూ పనిచేసింది. గ‌త నాలుగేళ్లుగా త‌మ‌న్నా క్రేజ్ త‌గ్గినా కూడా సీనియ‌ర్ హీరోల‌కు ఆమె మంచి ఆప్ష‌న్‌గా మారింది.

అలాగే తమిళంలో కూడా స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసింది. అక్కడ కూడా హిట్స్ అందుకుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్నా అందాలను ఎంజాయ్ చేసిన వారున్నారు. ఇంత సక్సెస్‌ఫుల్ కెరీర్‌లో ఇంకా తమన్నా క్రేజ్ తగ్గకుండా తన సత్తా చాటుతుందంటే ఫిజికల్‌గా తన మేయింటైనెన్స్ ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికీ తమన్నా అందం కాస్త కూడా తరగలేదు. పైగా జీరో బాడీ మెయింటైన్స్ చేస్తూ ఉంటుంది.

కుర్ర హీరోలకీ మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోలకీ సరిపోయేలా తన గ్లామర్‌ను మేయింటైన్ చేస్తుంది. తమన్నాకి డిజిటల్ ప్లాట్ ఫారంస్ మీద మంచి క్రేజ్ ఉంది. అందుకే, సినిమా కంటే భారీ ఆఫర్ ఇచ్చి వెబ్ సిరీస్‌లలో తీసుకుంటున్నారు. ఇదంత ఒకెత్తైతే తమన్నా ఐటెం సాంగ్స్ చేయడం మరో క్రేజ్. ఇప్పటికే ఈ మిల్కీ బ్యూటీ చేసిన ఐటెం సాంగ్స్ బాగా హిట్ సాధించాయి.

అయితే, ఈ మిల్కీకి ఇప్పటి వరకూ మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ రాలేదు. చెప్పాలంటే తమన్నాని ఇంతకాలం త్రివిక్రమ్‌ ఎలా మిస్ అయ్యారో అర్థం కావడం లేదు. అందుకేనేమో ఇప్పుడు ఆయన కనీసం ఐటెం సాంగ్‌లో అయినా తమన్నాని చూపించాలనుకుంటున్నారట. ఒక్కసారి గురూజీ సినిమాలో నటించే అవకాశం అందుకుంటే ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటారు. దీనికి ఉదాహరణ సమంత, పూజా హెగ్డే, ఇలియానా. చూడాలి మరి గురూనీ తమన్నా ఎలా రౌండప్ చేస్తుందో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news