Moviesషాకింగ్‌: ఎన్టీఆర్‌కు ఆ హీరోయిన్ నిజంగానే చెల్లి అవుతుందా...!

షాకింగ్‌: ఎన్టీఆర్‌కు ఆ హీరోయిన్ నిజంగానే చెల్లి అవుతుందా…!

సినిమాలో క‌థ ఉంటే చాలు.. ప‌క్కన ఎవ‌రు న‌టిస్తున్నారు ? అనే ఆలోచ‌నే లేకుండా అన్న‌గారు కొట్టిన హిట్లు అనేకం ఉన్నాయి. ఇలాంటి వాటిలో శ్రీ ప్రొడక్షన్సు సంస్థ నిర్మించిన‌ మనసుకు మంచిరోజులు (1958) ఒక‌టి. ఈ సినిమాలో హీరోయిన్‌కు పెద్ద‌గా పాత్ర ఉండ‌దు. కేవ‌లం అన్నా చెల్లి మ‌ధ్య జ‌రిగే పాత్ర‌తోనే ఈ సినిమాను రూపొందించారు. వాస్త‌వానికి తై పిరందాళ్ వళి వరక్కుమ్ అనే తమిళ చిత్రం ఆధారంగా ఈ సినిమాను తీశారు.

నిజానికి అప్ప‌ట్లో డ‌బ్బింగ్ సినిమాల‌కు పెద్ద‌గా ఇష్ట‌ప‌డే వారు. అయినా.. అన్న‌గారు అవేమీ ప‌ట్టించుకు నేవారు కాదు. క‌థ‌లో దమ్ముంటే చాల‌ని న‌మ్మేవారు. స‌మాజ హితం ఉంటే చాల‌నేవారట‌. ఇక‌, ఈ చిత్రంలో రాజసులోచన ఎన్.టి.ఆర్. చెల్లెలుగా నటించడం విశేషం. అనురాగమూర్తి అయిన అన్నగా, చెల్లెలిపట్ల గారాబం, అభిమానం, పేద రైతులకు అండగా పంటకాలువ గండి తీయించడంలో, వెంకటప్పయ్య (రేలంగి)ని ఎదుర్కొని తుపాకీకి ఎదురు నిలవడం.. వంటి సీన్‌లు బాగా హిట్ట‌య్యాయి.

అదే స‌మ‌యంలో మమకారం, దైన్యం, ధైర్యం… నవరసాలనూ తెరపై ఆవిష్కరించి వైవిధ్యభరితమైన నటనతో ఎన్టీఆర్ అలరించారు. ఈయనపై చిత్రించిన వినవమ్మా వినవమ్మా, కలవారి స్వార్థం, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి పాటలు బాగా స‌క్సెస్ అయ్యాయి. చెల్లిగా రాజ‌సులోచ‌న న‌టించ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి అప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ గా ఆమె న‌టించారు. అయితే ఈ సినిమాలో అన్న‌గా ఎన్టీఆర్‌, చెల్లిగా రాజ సులోచ‌న న‌టన చూసిన వారంతా వీరిది నిజ‌మైన అన్నా చెళ్లెల్ల బంధం అన్నంత గొప్ప‌గా చేశార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. అన్నా చెల్లెళ్ల సెంటిమెంటుతో అఖిలాంధ్ర జ‌నాన్ని ఊపేసిన‌ ఈ సినిమా విజ‌య‌వాడ స‌హా ఆరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకోవ‌డం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news