Movies"నో చెప్పిన వాళ్లే నన్ను ఫాలో అవుతున్నారు"..సీరియల్ నటి సెన్సేషనల్ కామెంట్స్..!!

“నో చెప్పిన వాళ్లే నన్ను ఫాలో అవుతున్నారు”..సీరియల్ నటి సెన్సేషనల్ కామెంట్స్..!!

టాలెంట్ ఉంటే జనాలు ఎక్కడైనా ఆదరిస్తారు అని మరోసారి ప్రూవ్ చేసింది సీరియల్ నటి మల్టీ టాలెంటెడ్ యూట్యూబర్ గా పేరు సంపాదించుకున్న అస్మిత . చూడడానికి హీరోయిన్ కి మించిపోయే ఫిజిక్కున్నా కానీ సినిమాలో హీరోయిన్గా అవకాశాలు రాలేదు . సైడ్ క్యారెక్టర్స్ కూడా చెప్పుకోతగ్గవి రాకపోవడంతో చిన్న చిత్కా పాత్రలు చేసుకుంటూ సీరియల్స్ లోనే అడ్జస్ట్ చేసుకుంటూ నెట్టుకొచ్చింది . కాగా ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి యూట్యూబఅర్ గా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు సూపర్ సక్సెస్ ఉమెన్ గా మారిపోయింది.

కాగా రీసెంట్గా యాష్ ట్రిక్స్ అనే పేరుతో అస్మిత చేసిన వీడియోలు ఆమెకు మరింత పేరును తెచ్చిపెట్టాయి . సీరియల్స్ లో వెండితెరపై నటిగా సక్సెస్ అయిన అస్మిత ఇలా యూట్యూబఅర్ గా కూడా ఫుల్ గా సక్సెస్ అవడంతో ఆమె రేంజ్ మారిపోయింది . అంతేకాదు డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఆమె చాలామంది సలహాలు తీసుకుందట . హెల్ప్ కోసం ట్రై చేసిందట. అయితే ఎవరు కూడా అందుకు సపోర్ట్ చేయలేదని ..ఇలాంటివి ఇక్కడ వర్కౌట్ అవ్వవు అని స్కిప్ చేస్తే మంచిది అని తనను డీ గ్రేడ్ చేశారని.. కానీ ఇప్పుడు అలాంటి వాళ్లే తనను ఫాలో అవుతూ తనను మెచ్చుకుంటున్నారని చెప్పుకొని ఎమోషనల్ అయింది.

రీసెంట్గా “ఏ వన్ ఫ్రొం డే వన్” అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు అస్మిత . ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ..”నటిగా కెరియర్ ఫుల్ పిక్స్ గా ఉన్న టైంలోనే డిజిటల్ మీడియాలోకి వచ్చాను .సీరియల్స్ ఆపేసి మరి ఇలా డిజిటల్ మీడియాలోకి వచ్చినప్పుడు నన్ను చాలామంది వార్న్ చేశారు . దీనిని ఎవరు చూస్తారు అన్న కామెంట్స్ కూడా నేను డైరెక్ట్ గా విన్నాను . అయితే అప్పుడు నన్ను ఎగతాళి చేసిన వారందరూ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు అది నాకు చాలా ఆనందంగా ఉంది . ఈ సిరీస్ నేను సుధీర్ర్ భార్య భర్తలుగా నటిస్తున్నాం .

ఈ సిరీస్ డిసెంబర్ 10న స్ట్రీమింగ్ అవ్వబోతుంది . కచ్చితంగా ఈ సిరీస్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం . ఈ సినిమాలో అలీగారు కూడా ఓ ప్రధాన పాత్రలో నటించి మాకు హెల్ప్ చేశారు “అంటూ చెప్పుకొచ్చింది . ప్రస్తుతం అస్మిత మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . తన సిరీస్ ని ప్రమోట్ చేసుకోవడానికి అస్మిత ఇలాంటి కామెంట్స్ చేసింది అన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news