Moviesబిగ్ బాస్ చరిత్రలోనే మరో సంచలనం..బండ బూతులు తిడుతున్న జనాలు..!!

బిగ్ బాస్ చరిత్రలోనే మరో సంచలనం..బండ బూతులు తిడుతున్న జనాలు..!!

ఇది నిజంగా దారుణాతి దారుణం అంటున్నారు బిగ్బాస్ అభిమానులు . హౌస్ లో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ కు కష్టపడి మేము ఓట్లు వేసి వారిని సేవ్ చేయాలని చూస్తుంటే బిగ్ బాస్ తనకు నచ్చిన వాళ్ళని హౌస్ లో ఉంచుకొని ..నచ్చని వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు . ఇప్పటివరకు చాలా సీజన్స్ లో ఇలా చేసిన బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్స్ లో మాత్రంనిజాయితీగా ప్లాన్ చేసుకున్నాడు . కానీ ఈ సీజన్ కి మాత్రం కర్త – కర్మ – క్రియ అన్ని బిగ్ బాస్ అయి షో ని తనకు నచ్చిన విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ 6 మరికొన్ని వారాల్లో ముగియనుంది . తుది దశకు చేరుకున్న బిగ్బాస్ 6 లో రసవత్తరంగా పోటీ నెలకొంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో ఏ కంటెస్టెంట్స్ కప్ కొడతాడు అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బయట ఉండే జనాలు వాళ్ళ కుటుంబ సభ్యులు . కాగా ఈ క్రమంలోనే ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం రేవంత్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం ఈ సీజన్ బిగ్ బాస్ 6 టైటిల్ కొట్టేది రేవంత్ అంటూ బలంగా టాక్ వినిపిస్తుంది .

తర్వాత ఆ రేంజ్ లో ఓటింగ్ సంపాదించుకున్న కంటెస్టెంట్ రోహిత్ ..ఆ తర్వాత పొజిషన్లో ఇనయ, ఆది రెడ్డి ఉన్నారు . కాబట్టి డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ శ్రీ సత్య-కీర్తి. ఈ ఇద్దరిలో ఈవారం హౌస్ నుండి కచ్చితంగా ఒక ఎలిమినేట్ అవుతారు అంటూ తెలుస్తుంది . అయితే కీర్తికి జనాల్లో సింపతి ఓటింగ్ ఎక్కువైంది. ఈ క్రమంలోనే ఆమె ఓటింగ్ శాతం శ్రీ సత్య కన్నా పెరిగింది. అయితే హౌస్ లో శ్రీ సత్య-కీర్తి ఇద్దరిని పెడితే ఎవరు టీఆర్పీలు రేటింగ్ తీసుకొస్తారా అంటే అందరూ చెప్పే పేరు శ్రీ సత్య. పులిహోర కలపడంలో శ్రీ సత్య తర్వాత ఎవరైనా అన్న ఒక ట్యాగ్ వేయించుకునింది.

ఈ క్రమంలోని సింపతి కీర్తిని హౌస్ నుండి బయటికి పంపించేసి కన్నింగ్ శ్రీ సత్యను హౌస్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు బిగ్ బాస్ అంటూ మండిపడుతున్నారు జనాలు .అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం కీర్తి హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఓటింగ్ శాతం లో శ్రీ సత్య కన్నా కీర్తి ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న శ్రీ సత్య ను సేవ్ చేసి కీర్తిని ఎలిమినేట్ చేయడం పై మండిపడుతున్నారు బిగ్బాస్ ఫ్యాన్స్ .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news