Moviesబ‌న్నీ ల‌వ‌ర్‌తో బాల‌య్య రొమాన్సా....!

బ‌న్నీ ల‌వ‌ర్‌తో బాల‌య్య రొమాన్సా….!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో వీర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఈ నెల నుంచి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లోనే 108వ సినిమాగా తెర‌కెక్క‌నుంది. బాల‌య్య‌తో సినిమా చేసేందుకు ఎంద‌రో ద‌ర్శ‌కులు వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే బాల‌య్య‌తో ఆయ‌న ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయ‌డం అంత స‌లువు అయితే కాదు.

బాల‌య్య‌కు త‌గిన క‌థ‌తో పాటు న‌టీన‌టులు, హీరోయిన్ కూడా ఉండాలి. బాల‌య్య ఎలివేష‌న్లు ఓ రేంజ్లో ఉండాలి. అందుకే అనిల్ రావిపూడి కూడా చాలా కుస్తీ పాట్లు ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే బాల‌య్య పాత్ర‌ను ఓ రేంజ్‌లో రెడీ చేసుకోగా… బాల‌య్య కూతురుకుగా యంగ్ హీరోయిన్ శ్రీలీల‌ను ఎంపిక చేశారు. ఇక బాల‌య్య‌కు జోడీగా స‌రైన హీరోయిన్ కోసం నాలుగు నెల‌ల నుంచే వెతుకులాట ప్రారంభ‌మైంది.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం బాల‌య్య జోడీని అనిల్ సెట్ చేసేశాడ‌ట‌. ఆ అమ్మాయి తెలుగ‌మ్మాయే. ఏపీలోని అనంత‌పురం జిల్లాకు చెందిన ప్రియాంక జ‌వాల్క‌ర్ తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ట్యాక్సీవాలా సినిమాతో బాగా పాపుల‌ర్ అయ్యింది. ఆ సినిమాలో ఆమె అంద‌చందాలు చూసిన తెలుగు కుర్ర‌కారు ఆమె క్యూట్ లుక్స్‌కు ఫిదా అయిపోయారు.

పైగా ట్యాక్సీవాలా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్లో ప్రియాంక బ‌న్నీ అంటే నాకు ఎంతో క్ర‌ష్ అంటూ చేసిన కామెంట్లు అప్ప‌ట్లో పెద్ద ర‌చ్చ‌లేపాయి. ఆమె బ‌న్నీ ల‌వ‌ర్ అని కొంద‌రు… ప్రియాంక బ‌న్నీతో డేట్ ఇష్ట‌ప‌డుతుంద‌ని మ‌రి కొంద‌రు కామెంట్ చేశారు. ఇప్పుడు ఆమెనే బాల‌య్య‌కు జోడీ కాబోతోంద‌ని టాక్ ? తాజాగా అనిల్ రావిపూడి ప్రియాంక‌పై ఫొటో షూట్ పెట్టి మ‌రీ ఆమెను ఫైన‌ల్ చేశాడని అంటున్నారు.

అయితే ప్రియాంక‌నే బాల‌య్య‌కు జోడీగా మెయిన్ హీరోయినా ? లేదా మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ ఎవ‌రైనా ఉంటారా ? అన్న‌ది మాత్రం చూడాలి. ప్రియాంక ఇప్ప‌టి వ‌ర‌కు టాప్ హీరోల‌తో చేయ‌లేదు. అర‌కొర ఆమె చేసిన సినిమాల క‌న్నా బ‌న్నీపై ఆమె చేసిన కామెంట్ల‌తోనే ఆమెకు మంచి గుర్తింపు వ‌చ్చింది. మ‌రి బాల‌య్య ప‌క్కన ఆమె మెయిన్ హీరోయిన్ అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుంది ? ఈ జోడీ ఎలా మ్యాచ్ అవుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news