Moviesఏజ్‌బార్ ఆంటీ, ముస‌ల్ది త్రిష పెళ్లెప్పుడు చేసుకుంటుందో... ఇంతలా టార్గెట్ చేస్తున్నారా...!

ఏజ్‌బార్ ఆంటీ, ముస‌ల్ది త్రిష పెళ్లెప్పుడు చేసుకుంటుందో… ఇంతలా టార్గెట్ చేస్తున్నారా…!

సౌత్‌లో ఉన్న ఏజ్ బార్ హీరోయిన్స్‌లో తమిళ కుట్టి త్రిష కృష్ణన్ ఒకరు. కుర్ర హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి..బాలకృష్ణ..వెంకటేష్..పవన్ కళ్యాణ్…నాగార్జున లాంటి సీనియర్ హీరోల వరకు దాదాపు అందరి సరసన హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్‌గానూ నిలిచింది. ముఖ్యంగా తన స్నేహితులతో నైటు పార్టీలను చేసుకొని రోడ్లపై నానా హంగామా చేస్తూ పోలీసులకి చిక్కిన సందర్భాలెన్నో ఉన్నాయి.

 

సోషల్ మీడియాలో కూడా త్రిష కృష్ణన్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. దీనిలో తన ఒంటిమీద ఉన్న టాటూ కూడా హైలెట్ అయిన సందర్భాలున్నాయి. ఇక త్రిష ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచీ ఎవరో ఒక హీరోతో డేటింగ్ చేస్తూ ఉందంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కూడా. అయినా త్రిష వాటిని తీసి చెత్తబుట్టలో పడేసినట్టుగా లైట్ తీసుకుంది. ఎన్ని చేసినా త్రిష మాత్రం హీరోయిన్‌గా క్రేజ్‌ను పోగొట్టుకోలేదు.

మణిరత్నం లాంటి అగ్ర దర్శకులు తనకి సూటవుతుందంటే ప్రధాన పాత్రలను తనకే ఇస్తున్నారు. ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వన్ మూవీలో ఓ కీలక పాత్రను పోషించింది. అయితే, సినిమా ఫ్లాపవడం ఆమెకి మైనస్ అయింది. 96 మూవీతో రీ ఎంట్రీ లాంటి సాలీడ్ హిట్ అందుకున్న త్రిష ఆ తర్వాత వరుసగా సినిమాలను కమిటవుతోంది. కానీ, సక్సెస్‌లే దక్కడం లేదు. మరో వైపు త్రిష పెళి ఓ హాట్ టాపిక్ అవుతోంది.

 

దాదాపు 4 పదుల వయసులో ఉన్న త్రిష ఫిజిక్‌ను మాత్రం బాగా మేయింటైన్ చేస్తుంది. ఇప్పటికీ పాతికేళ్ళ అమ్మాయిలా కనిపిస్తుంది. అయితే, అదంతా మేకప్ మహిమే అంటున్నారు. నలభై ఏళ్ళు అంటే నడికారు వయసు..ఓ రకంగా ఏజ్ బార్ బ్యూటీ..ముసల్ది ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంత వయసు వచ్చినా త్రిష ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో అని చాలామంది టార్గెట్ చేసి మ‌రీ మాట్లాడుకుంటున్నారు. మరి నయనతార మాదిరిగా త్రిష ఎప్పుడు పెళ్ళి పీటలెక్కుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news