Moviesడేంజ‌ర్‌లో సమంత కెరీర్.... ఏదో అవుతుంద‌నుకుంటే ఇంకేదో అవుతోందే...!

డేంజ‌ర్‌లో సమంత కెరీర్…. ఏదో అవుతుంద‌నుకుంటే ఇంకేదో అవుతోందే…!

సమంత కెరీర్ ఇలా మారిపోతుందేంటీ..ఆదుకునే దర్శకుడెవరు..? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాక్ వినిపిస్తోంది. మజిలీ, ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత సమంత నటించిన జానూ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకుంటే ఆ కోరిక నెరవేరలేదు. అప్పటికీ సమంత..నాగ చైతన్య నుంచి విడిపోలేదు. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటించాల్సింది. కానీ, కథ చైతుకి నచ్చకపోవడంతో ప్రాజెక్ట్‌కి నో చెప్పడమే కాదు..సమంతని కూడా జానూ చేయొద్దని సలహా ఇచ్చాడు.

కానీ, సమంత వినలేదు. తనకి తమిళ సూపర్ హిట్ 96 విపరీతంగా నచ్చడంతో ఇక్కడ కూడా తన పాత్రకి మంచి పేరొస్తుందనీ.. భారీ హిట్ అందుకుంటుందనీ భావించింది. కానీ, జానూ ఫలితం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటివరకూ సమంత నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ సాధించింది లేదు. ఈ మధ్యలో సమంత నాగ చైతన్య నుంచి విడిపోవడం..దాని తాలూకా ప్రభావం బాగా పడి సోషల్ మీడియాలో నానా రచ్చా జరగడం అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత సమంత కోలుకుని పరిస్థితులన్నీ తట్టుకొని మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్‌ కమిటవుతోంది. ఇప్పటికే శాకుంతలం, యశోద సినిమాలు చేయగా వాటిలో గత వారం యశోద రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా రిలీజైన రోజు హిట్ టాక్ వచ్చింది. కానీ, మూడు రోజుల తర్వాత అసలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోతుందనీ వసూళ్ళు రావడం లేదనీ చెప్పుకుంటున్నారు. ఓవరాల్‌గా సమంతకి యశోద చేదు జ్ఞాపకంగానే మిగిలడం ఖాయం అంటున్నారు.

దీనికి ముందు వచ్చిన తమిళ సినిమా కూడా తెలుగులో రిలీజై ఫ్లాప్‌గా నిలిచింది. ఇప్పుడు యశోద. ఇక ఇప్పటికే గుణశేఖర్ రూపొందిస్తున్న శాకుంతలం సినిమా మీద పెద్దగా అంచనాలు క్రియేట్ కావడం లేదు. ఇప్పటివరకూ వచ్చిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచలేదనే టాక్ వినిపిస్తుంది. దీనినిబట్టి చూస్తే తెలుగులో సమంతకి మళ్ళీ ఏ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ గానీ..కొరటాల శివ గానీ అవకాశం ఇచ్చి ఆదుకోవాలి. అంతేకాదు, హిట్టు కూడా ఇవ్వగలగాలి. లేదంటే మెల్లగా సమంతను టాలీవుడ్ జనాలు మర్చిపోయే అవకాశాలున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news