Moviesపెళ్లిసందD హీరోయిన్ శ్రీలీల కెరీర్‌ను దెబ్బ‌తీస్తోన్న టాలీవుడ్ హీరో... బ‌లైపోవాల్సిందేనా..!

పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీల కెరీర్‌ను దెబ్బ‌తీస్తోన్న టాలీవుడ్ హీరో… బ‌లైపోవాల్సిందేనా..!

సీనియర్ హీరో వల్ల మాళవిక శర్మ లాగే పెళ్లి సందడి హీరోయిన్ కెరీర్ కూడా దెబ్బతింటుందా..? ప్రస్తుతం ఇలాంటి కామెంట్స్ టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం ధమాకా సినిమా. అదేంటీ అందరూ అని కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ, అసలు విషయం తెలిస్తే అది నిజమనిపిస్తుంది. తిప్పి కొడితే 20 ఏళ్లు కూడా ఉండని యాపిల్ లాంటి బ్యూటీ మాళవిక శర్మ మాస్ మహారాజ రవితేజ సరసన మొదటి సినిమా అవకాశం అందుకుంది.

ఈ సినిమా అవకాశం అమ్మడి కెరీర్‌ని గట్టి దెబ్బ కొట్టింది. ఇదే మాళవిక శర్మ యంగ్ హీరోలు అల్లు అర్జున్, రాం చరణ్, ఎన్.టి.ఆర్ లాంటి వారి సరసన పడి సినిమా గనక భారీ హిట్ సాధిస్తే ఆ రేంజ్ మరోలా ఉండేది. ఆమెకు ఉన్న అందానికి తోడు ల‌క్ క‌లిసి వ‌స్తే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవ్వ‌డంతో పాటు కొన్నాళ్ల పాటు ఇండ‌స్ట్రీని దున్నుకునేది. కానీ, రవితేజ సరసన మొదటి సినిమా చేయడం పెద్ద మైనస్ అయింది. అంతేకాదు, రెండవ సినిమా రాం సరసన చేసినా ఆ సినిమా ఫ్లాప్ వల్ల అమ్మడికి కలిసి వచ్చింది లేదు.

ఇదే మాళ‌విక శర్మ కెరీర్‌కి పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు మాస్ మహారాజా వల్ల మరో యంగ్ బ్యూటీ పెళ్లి సందడి భామ శ్రీలీల కెరీర్ కూడా ఎగిరిపోయే ఇస్తరాకులా అవుతుందని అంటున్నారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో లేడీ డైరెక్టర్ గౌరీ రోనంకీ తెరకెక్కించిన పెళ్లి సందడి మూవీతో తెలుగు తెరకి పరిచయమై యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఆమె అందాల‌కు ఫిదా అవ్వ‌ని కుర్రాళ్లే లేరు. తొలి సినిమాతోనే మంచి క్రేజ్‌తో పాటు కొన్ని అవ‌కాశాలు కూడా ప‌ట్టేసింది. అయితే, ఈ కుర్రభామ ఇప్పుడు రవితేజ సరసన ధమకా సినిమాలో రవితేజకి జంటగా నటిస్తుంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూసిన అభిమానులు, ప్రేక్షకులు చాలా చిరాకు పడుతున్నారు. ట్రైల‌ర్లో శ్రీలీల‌, ర‌వితేజ మ‌ధ్య ఉన్న ఎక్స్‌ప్రెష‌న్స్ సీన్ చూసిన జ‌నాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

తండ్రి, కూతుళ్ల‌లా ఉన్న వీరి మ‌ధ్య రొమాన్స్ ఏంట్రా ? బాబు అని షాక్ అవుతున్నారు. అసలు రవితేజ ఎలా ? శ్రీలీల పక్కన నటించడానికి ఒప్పుకున్నాడు..కనీసం తన ఏజ్ గ్యాప్ చూసి అయినా ఆ ఏజ్‌కి తగ్గ హీరోయిన్‌ని ఎంచుకోవాలి కదా..? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా హిట్ అయినా, ఫ్లాపైనా శ్రీలీల కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో సాగదనే మాట వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news