Moviesఅభిమానులకు ఎన్టీఆర్‌ బిగ్ సర్‌ ప్రైజ్‌..ఈ కొత్త గెటప్ అందుకోసమేనా..?

అభిమానులకు ఎన్టీఆర్‌ బిగ్ సర్‌ ప్రైజ్‌..ఈ కొత్త గెటప్ అందుకోసమేనా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో యంగ్ టైగర్ తారక్ న్యూ లుక్ ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో సినిమాలతో ఎంటర్టైన్ చేసే తారక్ ..రీసెంట్ గానే తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ కి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే . రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియాలో రిలీజ్ అయి ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సంపాదించుకుందో మనందరికీ తెలుసు .

కాగా ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేయడానికి డేరింగ్ స్టెప్ వేసి హీరోలు రామ్ చరణ్ -తారక్ లను అక్కడికి తీసుకెళ్ళి సినిమాను ప్రమోట్ చేయించాడు జక్కన్న. కాగా ఎవరు ఊహించని విధంగా జపాన్ లో కూడా ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి 21 రోజులు అయింది ..నిన్న కూడా సినిమా హ్యూజ్ రేంజ్ కలెక్షన్ సాధించింది .

కాగా ప్రజెంట్ ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . స్టైలిష్ క్రాఫ్, వెరైటీ గడ్డంతో.. గాగుల్స్ పెట్టుకొని.. జీన్స్ వేసుకొని కెమెరాకు ఫోజులు ఇచ్చాడు . దీంతో తారక్ లుక్ సోషల్ మీడియాలో జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలో మనం గమనించినట్లయితే వెనకల ఉన్న ఆయన కెమెరా పట్టుకొని ఫోటో తీస్తున్నాడు . అద్దం లో చూసుకుంటున్న తారక్..చాలా స్టైలిష్ గా ఉన్నాడు . అయితే ఈ మోడరన్ లుక్ కొరటాల సినిమా కోస, ట్రై చేస్తున్నారా ..? లేక కమర్షీయల్ యాడ్ కోసం ట్రై చేస్తున్నారా ..?అన్నది తెలియాల్సి ఉంది . ఏది ఏమైనా సరే తారక్ ను లాంటి స్టైలిష్ లుక్ లో చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news