Moviesఆ హీరోల వల్ల శృతి హాసన్ కెరీర్‌కి బ్రేక్ పడుతుందా.. పెద్ద...

ఆ హీరోల వల్ల శృతి హాసన్ కెరీర్‌కి బ్రేక్ పడుతుందా.. పెద్ద త‌ప్పు చేసిందా..!

సీనియర్ హీరోల వల్ల శృతి హాసన్ కెరీర్‌కి బ్రేక్ పడుతుందా..? ప్రస్తుతం నెటిజన్స్ మధ్య ఇదే టాక్ వినిపిస్తోంది. దాదాపు మూడేళ్ళ తర్వాత బక్కపలచని భామ శృతి హాసన్ క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకొని ఫాంలోకి వచ్చింది. చెప్పాలంటే క్రాక్ బ్రేక్ ఇచ్చింది ఒక్క శృతికి మాత్రమే కాదు..హీరో మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిలకి కూడా. ఈ ముగ్గురు మూడేళ్ళ గ్యాప్ తర్వాత చేసిన సినిమా క్రాక్.

అందరూ ఎంతో కసిగా చేసిన ఈ సినిమా కరోనా కష్టకాలంలో విడులై అనూహ్యంగా భారీ కమర్షియల్ సక్సెస్ సాధించింది. అంతేకాదు, హీరోగా రవితేజ నటించిన సినిమాలలో హైయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాగా రికార్డ్ నమోదు చేసింది. అస‌లు ర‌వితేజ‌, శృతీహాస‌న్ ఇద్ద‌రి కెరీర్ అయిపోయింది.. ఇద్ద‌రిని జ‌నాలు మ‌ర్చిపోయార్రా బాబు అనుకుంటోన్న టైంలో ఈ సినిమా వ‌చ్చి ఇద్ద‌రి కెరీర్‌ల‌కు ఊపిరిలూదింది.

క్రాక్ తర్వాత గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి సినిమాని రూపొందిస్తున్నారు. బాల‌య్య త‌ర్వాత అఖండ న‌టిస్తోన్న సినిమా ఇదే. ఇటు రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక శృతి హాసన్‌కి గోపీచంద్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. బాలయ్య సరసన అవకాశం ఇచాడు. అలాగే, యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమాలోనూ చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

బాలయ్య, చిరు తప్ప..మిలిగిన ఇద్దరు దర్శకులు, రవితేజలతో ఇప్పటికే శృతి హాసన్ సినిమాలు చేయడం విశేషం. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, క్రాక్ లాంటి మాంచి కమర్షియల్ హిట్ తర్వాత రామ్‌ చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లాంటి వారితో సినిమాలు చేస్తే ఒకే గానీ, మరీ సీనియర్ హీరోలు బాలయ్య, చిరులతో అంటే కాస్త కెరీర్ కష్టమే అంటున్నారు. ప్రభాస్ సరసన ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా సలార్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇది పాన్ ఇండియన్ సినిమా. ఇదే శృతి కెరీర్‌కి చాలా ఉపయోగపడుతుంది. మిగిలిన సినిమాలలోనూ బాలయ్య సినిమా బాగా కలిసి వచ్చెదే. ఎటొచ్చీ వాల్తేర్ వీరయ్య సినిమా గురించి డైలమా. మరి చిరు, బాలయ్య సినిమాలు అమ్మడికి ఏ మేరకు కలిసివస్తాయో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news