Moviesకృష్ణ చనిపోయినందుకు ఎవ్వరు బాధపడకండి.. ఆ వీడియో తో షాకిచ్చిన ఆర్జీవీ..ఏం...

కృష్ణ చనిపోయినందుకు ఎవ్వరు బాధపడకండి.. ఆ వీడియో తో షాకిచ్చిన ఆర్జీవీ..ఏం మనిషివి రా బాబు నువ్వు.!!

టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ.. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇన్నాళ్లు తన జీవితాన్ని ముందుకు తీసుకు రాగలిగారు. గత వారం రోజులుగా ఇంట్లో జరుగుతున్న గొడవలు కారణంగా ..ఫుల్ డిప్రెషన్ కి లోనైనా కృష్ణ ..నిన్న ఉదయం తెల్లవారుజామున హెల్త్ బాగో లేకపోవడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తీసుకెళ్లారు .అయితే హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న కృష్ణ.. తన బాడీ ఏం సహకరించకపోవడంతో ట్రీట్మెంట్ కి రెస్పాండ్ కాకపోవడంతో వైద్యులు చేతులెత్తేశారు .

వైద్య వృత్తి ప్రకారం ఏ పేషెంట్ కైనా సరే ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అతని బాడీ సహకరించకపోతే అతన్నికి ఇక ట్రీట్మెంట్ ఇచ్చి బాధపెట్టే రైట్ ఎవ్వరికీ లేదు . ఈ క్రమంలోనే డాక్టర్స్ కూడా అందరి సామాన్య ప్రజలకి ట్రీట్మెంట్ ఇచ్చినట్లే కృష్ణకు ఇచ్చారు. ఇక బాడీ కండిషన్ బాగాలేదు బతకరు అని తెలిసిన తర్వాత ఆయనపై ఎలాంటి మందు ప్రయోగించలేదు.. సుదులతో గుచ్చి ఆయన ను టార్చర్ పెట్టలేదు ప్రశాంతమైన మరణాన్ని ఆయనకు అందించారు . కాగా కృష్ణ మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది .

మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబును ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. తండ్రి పార్ధివ దేహం వద్ద వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రముఖులు స్నేహితులు ఆయన మరణాన్ని జర్ణించుకోలేక పార్థివ దేహం వద్ద విలపిస్తున్నారు . అయితే కాంట్రవర్షీయల్ డైరెక్టర్ కృష్ణ మాత్రం కృష్ణ చనిపోయినందుకు ఎవరు బాధపడకండి.. ఆ అవసరమే లేదు అంటూ ట్విట్ చేశాడు. దీంతో మరోసారి ఆయన పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

కృష్ణ మరణం గురించి మాట్లాడుతూ ..”కృష్ణ గారు ఇక్కడ లేరని ఎవరు బాధపడాల్సిన పనిలేదు ..ఎందుకంటే ఈ టైంకి కృష్ణ – విజయనిర్మల గారు స్వర్గంలో పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ సంతోషంగా ఉండి ఉంటారు . ఈ విషయాన్ని నేను కచ్చితంగా నమ్మగలను .అందుకే మీకు చెప్తున్నాను అంటూ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణ విజయ్ నిర్మలతో కలిసిన నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ ను రామ్ గోపాల్ జత చేసి “ట్వీట్ చేసాడు. అఫ్ కోర్స్ ఇది నిజమే అయినా ఎందుకో ఘట్టమనేని ఫ్యాన్స్ కి ఇది ఓవర్గా అనిపించింది. సీనియర్ హీరో చనిపోయిన సమయంలో ఈ విధంగా స్పందిస్తారా అసలు నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా ..? అంటూ కొందరు ఆయన ని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. కొందరు మీరు చెప్పింది నిజమే కానీ చెప్పిన టైం బాగోలేదు సార్ అంటూ చెప్పుకువస్తున్నారు . ఏది ఏమైనా సరే ఆ జీవికి మెంటల్, క్రాక్ అన్న వర్డ్స్ ని మరోసారి నిజమే అని ప్రూవ్ చేసుకున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news