Moviesఆ బాలీవుడ్ కుర్ర హీరోయిన్‌తో కుర్ర క్రికెట‌ర్ లవ్‌స్టోరీ... ఒక్క మాట‌తో...

ఆ బాలీవుడ్ కుర్ర హీరోయిన్‌తో కుర్ర క్రికెట‌ర్ లవ్‌స్టోరీ… ఒక్క మాట‌తో క‌న్‌ఫార్మ్ చేశాడుగా…!

భార‌త క్రికెట్ జ‌ట్టు యంగ్ ఓపెనర్ శుభ‌మ‌న్ గిల్ ఇటీవ‌ల కాలంలో ఆట‌తో కంటే ఎఫైర్ల‌తో ఎక్కువుగా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో టీ 20 సీరిస్‌లో భాగంగా ప్ర‌క‌టించిన భార‌త జ‌ట్టులో అత‌డికి చోటు ద‌క్కింది. దీంతో గిల్ బాగా వార్త‌ల్లో నానుతున్నాడు. 23 ఏళ్ల ఈ యువ బ్యాట‌ర్ ఇప్పుడు వ‌న్డేల‌తో పాటు టీ 20ల్లోనూ త‌న స్టామినా ఫ్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక శుభ‌మ‌న్ గిల్ ప్రేమ క‌హానీల విష‌యానికి వ‌స్తే టీం ఇండియా మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ కుమార్తె సారాతో ముందు ప్రేమ‌లో ఉన్నాడు. సారా – గిల్ ఇద్ద‌రూ క‌లిసి కొన్నాళ్ల పాటు పీక‌ల్లోతు డేటింగ్‌లో ఉన్నార‌ని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. సోష‌ల్ మీడియాలో వీరు ఒక‌రినొక‌రు ఫాలో కావ‌డంతో పాటు ఒక‌రి ఫోటోల‌కు మ‌రొక‌రు లైకులు, కామెంట్లు చేసుకోవ‌డంతో వీరి ప్రేమ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్ల‌య్యింది.

సారా శుభ‌మ‌న్ గిల్‌తో డేటింగ్ చేయ‌డం తండ్రి స‌చిన్‌కు ఇష్టం లేద‌న్న ప్ర‌చార‌మూ గ‌ట్టిగానే న‌డిచింది. కార‌ణం ఏదైనా వీరిద్ద‌రు బ్రేక‌ప్ చెప్పేసుకున్నారు. వీరు ఎవ‌రి దారుల్లో వారు ఉన్నారు. అయితే ఇప్పుడు గిల్ మ‌రో బాలీవుడ్ కుర్ర హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్టు టాక్ ? ఆమె ఎవ‌రో కాదు ప‌టౌడీ వార‌సురాలు.. స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ కుమార్తె సారా ఆలీఖాన్‌. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి చ‌క్కెర్లు కొట్ట‌డంతో పాటు డిన్న‌ర్లు కూడా క‌లిసే చేస్తున్నార‌ట‌.

ఇటీవ‌ల ఓ చాట్ షోల పాల్గొన్న గిల్‌కు ఓ షాకింగ్ ప్ర‌శ్న ఎదురైంది. మీరు సారాతో డేటింగ్‌లో ఉన్నారా ? అని ప్ర‌శ్నించ‌గా… సారా గురించి మొత్తం నిజం చెప్పేయాల‌ని ప్ర‌శ్నించ‌గా.. నేను మొత్తం నిజం చెప్పేస్తున్నాను… నేను డేటింగ్‌లో ఉండొచ్చు… ఉండ‌క‌పోవ‌చ్చ‌ని షాకింగ్ రిప్లే ఇచ్చాడు. ఇక బాలీవుడ్ మొత్తం మీద అత్యంత ఫిట్‌గా ఉండే న‌టి ఎవ‌రు ? అని ప్ర‌శ్నిచంగా సారా పేరు చెప్ప‌డం విశేషం.

గిల్ చెప్పిన ఈ ఒక్క ఆన్స‌ర్‌తో సారాతో అత‌డు ప్రేమ‌లో ఉన్న‌ట్టు క‌న్‌ఫార్మ్ చేశాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మ‌రి సారాకు కూడా గ‌తంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో పాటు ఒక‌రిద్ద‌రు యంగ్ హీరోతో డేటింగులు అయ్యాయ‌న్న టాక్ ఉంది. మ‌రి వీరిద్ద‌రు ఎన్నాళ్లు క‌లిసి ఉంటారో ? కాల‌మే నిర్ణ‌యించాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news