Moviesఆ నొప్పి బాధ నాకు తెలుసు..అసలు విషయం ఓపెన్ గా చెప్పేసిన...

ఆ నొప్పి బాధ నాకు తెలుసు..అసలు విషయం ఓపెన్ గా చెప్పేసిన జబర్దస్త్ కమెడియన్..!!

జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్ ఎంతోమంది ఉన్నారు .వాళ్ళల్లో మరీ ముఖ్యంగా లేడీ గెటప్స్ వేసి జనాలను మెప్పించిన కంటెస్టెంట్స్ బోలెడు మంది ఉన్నారు. అయితే వాళ్లలో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది శాంతి స్వరూప్. షో స్టార్ట్ అయిన మొదలు నుండి ఇప్పటివరకు వేరే చానల్స్ లో ఆఫర్ వస్తున్నా ..కానీ, అన్నం పెట్టిన జబర్దస్త్ కు అన్యాయం చేయకూడదు అని ఇక్కడే కంటిన్యూ అవుతూ రెండుసార్లు బిగ్ బాస్ ఆఫర్ ని వదులుకొని జబర్దస్త్ కి నిజమైన శిష్యుడిగా రాణిస్తున్నాడు .

కాగా రీసెంట్గా శాంతి స్వరూప్ తన అమ్మగారితో కలిసి జబర్దస్త్ ఈటీవీలో సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాం కి గెస్ట్లుగా వచ్చారు. జబర్దస్త్ లో లేడీ గెటప్పులతో పాపులర్ అయిన శాంతి స్వరూప్, మోహన్ ,హరిత ,సాయి లేఖ అందరూ కూడా క్యాష్ ప్రోగ్రాం కి గెస్ట్లుగా వచ్చారు. తమ ఫాదర్ తో మదర్ తో కలిసి సందడి చేశారు .ఈ క్రమంలోనే జబర్దస్త్ శాంతి స్వరూప్ తాను జబర్దస్త్ లోకి రాకముందు ఎలాంటి బాధలు పడ్డాడో ఓపెన్ అప్ అయ్యారు.

ఎప్పుడు తన ఫ్యామిలీ సీక్రెట్స్ బయట పెట్టని శాంతి స్వరూప్ ఫస్ట్ టైం అందరి ముందు ఎమోషనల్ అయ్యారు . ఈ క్రమంలోనే శాంతి స్వరూప్ మాట్లాడుతూ ..”తమ చిన్నప్పుడు అమ్మ ఇంటింటికి తిరిగి పాచి పనులు చేసేదని ..ఆ డబ్బులతోనే మమ్మల్ని పెంచి పెద్ద చేసిందని.. ఆ సమయంలో మాకు ఆకలి బాధలు తెలుసాయి అని .. మా అమ్మగారు ఆమె పస్తులుండి మాకు ఫుడ్ పెట్టి మమ్మల్ని ఈ పొజిషన్ కి తీసుకొచ్చారని ..ఇప్పటికీ ఆ రోజుల్లో నేను మర్చిపోలేనని “కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ రోజులను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు . అంతేకాదు అమ్మకి గొంతు సరిగా లేదని ఆమె సరిగా మాట్లాడలేదని తెలిపాడు . ఏదో మాట్లాడాలనుకుంటుందని.. కానీ ఏమీ మాట్లాడలేదని భావోద్వేగానికి గురి చేశాడు. తన కొడుకే తనని బతికిస్తున్నాడని ఆసుపత్రులు చుట్టూ తిప్పుతున్నాడు అని చెబుతూ ఆమె బోరున ఏడ్చేసింది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news