Moviesవావ్: ఆ స్పెషల్ డే కోసం వర్షకు ఇమ్మానియేల్ ఖరీదైన గిఫ్ట్..త్వరలోనే...

వావ్: ఆ స్పెషల్ డే కోసం వర్షకు ఇమ్మానియేల్ ఖరీదైన గిఫ్ట్..త్వరలోనే తీపి కబురు..!!

జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్ ఎంతోమంది ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందే. వాళ్ళలో మరీ ముఖ్యంగా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న జంట వర్ష – ఇమ్మానియేల్. ఈ మధ్యకాలంలో వీళ్లిద్దరి పేర్లు ఎక్కువుగా వైరల్ అవుతున్నాయి .గతంలో సుధీర్ – రష్మి పేర్లు ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాయో.. ప్రజెంట్ వర్ష – ఇమ్మానుయేల్ పేర్లు అంతకన్నా డబుల్ రేంజ్ లో వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే జబర్దస్త్ లో వీళ్ళు కలిసి స్కిట్ చేసే టైంలో చేసే ఓవరాక్షన్ ..డబల్ మీనింగ్ పంచెస్ వీళ్ళ మధ్య ఏదో ఉంది అని క్రియేట్ చేసే విధంగా ఉంటాయి. నిజంగా వీళ్ళ మధ్య అది ఉందా అంటే లేదని అంటున్నారు మిగతా జబర్దస్త్ కమెడియన్స్ .

కేవలం స్కిట్లో భాగంగానే ఇమ్మానియేల్ – వర్ష అలా నటిస్తున్నారని.. వాళ్ళ మధ్య ఏమీ లేదని చాలామంది కమెడియన్స్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో చెప్పకువచ్చారు. స్కిట్ లో భాగంగా ఇమ్మానుయేల్ – వర్ష మెడలో తాళ్లి కూడా కట్టేశాడు . అయితే అక్కడ ఆమె ఏమీ అనకపోవడం తో మ్యాటర్ సీరియస్ అయ్యింది. ప్రమోషన్స్ కోసం పెళ్లి అనే బంధాన్ని కూడా మీరు నవ్వులాటగా చూస్తారా అంటూ జనాలు ఫైర్ అయ్యారు. కాగా రీసెంట్గా వర్ష పుట్టినరోజు వస్తున్న సందర్భంగా ఇమ్మానుయేల్ ఆమెకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.

ఆమెను ఊహించిన విధంగా ఓ బంగారు దుకాణానికి తీసుకెళ్లి ఆమెకు నచ్చిన హారాన్ని కొనుక్కోమంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఫిదా అయిపోయిన వర్ష తన ఫేవరెట్ హారాన్ని కొనుక్కునింది. దీంతో ఒక్కసారిగా వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే పబ్లిక్ గా మెడలో తాళి కట్టినా కానీ వర్ష ఏం అనలేదని .. అందుకే ఈ క్రమంలోనే ఆమెకు గిఫ్ట్ తీయిస్తున్నారని లేకపోతే ఓ ఫ్రెండ్ కి బంగారు హారాన్ని గిఫ్ట్ ఇస్తారా ..ఆయనకేమైనా కోట్ల ఆస్తి ఉందా ..?అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే ప్రమోషన్స్ కోసం ఇలా ఉన్న పరువును తీసుకుంటున్నారు వర్ష – ఇమ్మనువల్ అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు . మరికొందరైతే త్వరలోనే ఈ జంట గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏమో ఈ జంట ఎప్పుడు ఏ బిగ్ బాంబు పేలుస్తుందో చూడాలి మరి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news