Moviesఆ టైంలో నిద్ర పోకుండా ఎంత ఏడ్చానో..కన్నీళ్లు పెట్టిస్తున్న రష్మిక మాటలు..!!

ఆ టైంలో నిద్ర పోకుండా ఎంత ఏడ్చానో..కన్నీళ్లు పెట్టిస్తున్న రష్మిక మాటలు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది . పేరుకు కన్నడ బ్యూటీ ని అయినా తెలుగులో మంచి మంచి హిట్స్ అందుకొని తెలుగు హీరోయిన్గా గుర్తింపు పొందింది. అంతేకాదు ప్రజెంట్ రష్మిక గురించి ఎవరిని అడిగినా కానీ ఓ రేంజ్ లో పొగిడేసే విధంగా ఆమె నటనపై హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్గా కొనసాగుతుంది.

రీసెంట్గా బాలీవుడ్లో రష్మిక నటించిన చిత్రం “గుడ్ బై”. ఈ సినిమా అక్టోబర్ 7న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందన తీరిక లేకుండా గడుపుతుంది. సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ తన వ్యక్తిగత మ్యాటర్ ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ మీమ్స్ చూసి తాను ఎలా బాధపడతానో చెప్పి అభిమానుల కన్నీళ్లకు కారణమైంది.

ఆమె మాట్లాడుతూ..” నేను సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఏమీ తెలిసేది కాదు. కాల్ షీట్స్ ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎలాంటి స్టోరీస్ చేసుకోవాలి. నాకు గైడెన్స్ ఇవ్వడానికి ఎవ్వరూ లేరు .పెద్దగా ఎవ్వరితో మాట్లాడదాన్నే కాను . కానీ తర్వాత మెల్లగా సినీ ఇండస్ట్రీ అంటే ఏంటి అని అర్థం చేసుకున్నాను. సినిమా ఫ్లాప్ అయిన నేను బాధ పడలేదు.. కానీ నాపై కొందరు చేసిన ట్రోల్స్ ఇప్పటికీ నేను బాధపడుతున్నాను. నాది చాలా సున్నిత మనస్తత్వం.. శత్రువులు ఉండకూడదు అనుకుంటాను. నా ఫోకస్ అంతా నేను ఏం కావాలనుకుంటున్నాను దానిపైన పెడతాను. ప్రజెంట్ నా ఫోకస్ సినిమాలు పైనుంది అందుకే నన్ను దారుణంగా ట్రోల్ చేసే వారిని పట్టించుకోవట్లేదు. కానీ కెరియర్ కొత్తలో నన్ను ట్రోల్ చేసిన మీమ్‌స్ రాత్రి కలలో వచ్చేటివి ..నేను ఎవరినో వేడుకుంటున్నట్లు అందరూ నన్ను సమాజం నుంచి వెలివేసినట్లు భయంకరంగా కలలు వచ్చేవి ..ఆ టైంలో ఉలిక్కిపడి నిద్రలేచి ఏడ్చేసే దాన్ని.. రాత్రంతా అలాగే ఏడుస్తూ కూర్చున్నాను ,,నిద్రలేని రాత్రులు గడిపాను’ అంటూ తన చేదు అనుభూతులను గుర్తుచేసుకుంది రష్మిక.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news