Moviesమృణాల్‌ ఠాకూర్‌ సూసైడ్ అటెంప్ట్..ఆయన కారణంగానే.. బిగ్ బాంబ్ పేల్చిన సీతా..!?

మృణాల్‌ ఠాకూర్‌ సూసైడ్ అటెంప్ట్..ఆయన కారణంగానే.. బిగ్ బాంబ్ పేల్చిన సీతా..!?

ఈ మధ్యకాలంలో సూసైడ్ అనేది ఓ ఫ్యాషన్ అయిపోయింది . ప్రేమించిన అమ్మాయి సరిగ్గా మాట్లాడకపోయినా.. ప్రేమించిన అబ్బాయి టైంకి రిప్లై ఇవ్వకపోయినా ..అమ్మ నాన్నలు అరిచినా.. ఇష్టమైన ఫుడ్ దొరకకపోయినా.. ఫ్రెండ్స్ సరదాగా ఆట పట్టించిన ..ఎవ్వరు ఏమన్నా సరే ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా సూసైడ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సూసైడ్ ఏ ప్రాబ్లంకి పరిష్కారం కాదు. ప్రతి సమస్యకి ఓ ఆన్సర్ ఉంటుంది. దాన్ని సరైన వే గా తీసుకెళ్తేనే జీవితం మొత్తం హ్యాపీగా ఉండగలరు . అలాగే తెలిసే తెలియని వయసులో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మృణాల్‌ ఠాకూర్‌ కూడా సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిందట. ఈ క్రమంలోనే ఆమె లైఫ్ గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆ విషయాలంటే ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

మృణాల్‌ ఠాకూర్‌ ఒకప్పుడు అంటే ఈ పేరుకి పరిచయం అవసరం. కానీ, ఇప్పుడు అవసరమా..? “సీతారామం” సినిమాతో అవసరం లేనంతగా తన పేరుని జనాలకు గుర్తుండిపోయే విధంగా చేసుకున్న నటి. సినిమాలో రష్మిక మందన మృణాల ఠాకూర్ ఇద్దరు హీరోయిన్లుగా నటించినప్పటికీ 80% స్క్రీన్ స్పేస్ ఆకుపై చేసుకొని సీతగా జనాల మదిలో చెరగని ముద్ర వేసుకుంది మృణాల్‌ ఠాకూర్‌. ప్రిన్సెస్ నూర్జహాన్ గా నటించిన తీరు.. సామాన్య అమ్మాయిగా సీతగా మెప్పించిన తీరు జనాలని బాగా ఆకట్టుకుంది. దీంతో మృణాల్‌ ఠాకూర్‌ కు టాప్ హీరోయిన్ లిస్టులో ప్లేస్ ఇచ్చేశారు ప్రేక్షకులు. కాగా రీసెంట్గా సీతా మహాలక్ష్మి అదేనండి మృణాల్‌ ఠాకూర్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సూసైడ్ చేసుకోవాలనుకున్నానని కానీ కొన్ని రోజుల తర్వాత నిర్ణయం నుంచి వెనక్కి వచ్చానని చెప్పుకొచ్చింది.

సీతామహాలక్ష్మి మొదట డెంటిస్ట్ అవ్వాలనుకునిందట. ఈ క్రమంలోనే బిడిఎస్ చేద్దామని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్ కూడా తెచ్చుకుందట . కానీ కొన్ని రోజులకి ఆమెకు మీడియాపై మనసు మళ్లీందట. ఈ క్రమంలోని ఇంట్లో వాళ్ళు కూడా మొదట నో అన్న ఇంట్లో వాళ్ళు.. ఆ తర్వాత నీ ఇష్టం అంటూ వదిలేశారట . ఈ క్రమంలోనే బ్యాచిలర్ ఇన్ మాస్ మీడియాలో చేరిందట. అక్కడ కొన్ని రోజులు ఉన్న తరువాత..వాళ్ళ నాన్నకు బదిలీ అవ్వడంతో ముంబైలో ఆమె ఒక్కటే ఉండాల్సి వచ్చిందట.

ఈ క్రమంలోనే సింగిల్ గా అక్కడ ఉండడం తండ్రికి దూరంగా.. తండ్రి ప్రేమను దక్కించుకోలేక నలుగురితో కలవలేక చాలా ఇబ్బంది పడిందట. అంతేకాదు ఈ మీడియా రంగంలో నాకు సెట్ అవ్వదు అంటూ చాలా సార్లు ఏడ్చిందట. ఈ క్రమంలోనే బుర్రలో డిప్రెషన్ కి లోనై ఏవేవో ఆలోచనలు వచ్చాయట. ఒకసారి లోకల్ ట్రైన్ లో నుంచి దూకేద్దామా అంటూ ట్రై కూడా చేసిందట. కానీ నేను సూసైడ్ చేసుకుంటే మా నాన్న తట్టుకోలేరు అంటూ ఆగిపోయిందట .ఇక ఆ తర్వాత ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి నేను మోడలింగ్ వెళ్లానని.. ఆ క్రమంలోనే నాకు సినిమా ఆఫర్లు వచ్చాయని చెప్పుకొచ్చింది. దీంతో సీతా ఇన్ని కష్టాలు పడిందా అంటూ జనాలు షాక్ అవుతున్నారు . ప్రజెంట్ చేతిలో మూడు బడా ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news