Moviesఅబ్బా..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..మళ్లీ తెలుగులో తెర పై సందడి చేయనున్న ఇలియానా..ఆ స్టార్...

అబ్బా..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..మళ్లీ తెలుగులో తెర పై సందడి చేయనున్న ఇలియానా..ఆ స్టార్ హీరో సినిమాల్లోనే..!?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు పరిస్థితి ఎలా మారిపోతాయో ఎవరికీ తెలియదు. నిన్న మొన్నటి వరకు స్టార్ గా ఉన్నా హీరో ఈరోజు జీరో కావచ్చు. అలాంటి సిచువేషన్ నే ప్రజెంట్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది. ఇక హీరోయిన్స్ సంగతి అంటారా ..అసలుకి చెప్పడం వేస్ట్. ఒక్క హిట్టు కొడితే ఆటో గ్రాఫ్స్ , ఫోటో గ్రాఫ్స్ అంటూ హంగామా చేసే జనాలే ఒక ఫ్లాప్ పడగానే అమ్మడును గుర్తుపట్టలేనంత విధంగా ట్రోల్ చేస్తారు. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పరిస్థితి అలా దాపురించింది.

కాగా ఆ లిస్టులోకే వస్తుంది హాట్ బ్యూటీ ఇలియానా . ఈ గోవా బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవదాస్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్స్ అయిన ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించి మరిన్ని బ్లాక్ బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది.

అయితే .. అంత త్వరగా ఇండస్ట్రీలో స్టార్ అయ్యిందో..అంతే త్వరగా పడిపోయింది. తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్న టైం లోనే బాలీవుడ్ కి చెక్కేసిన ఇలియానా.. అక్కడ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వగానే పరిస్థితి మారిపోయింది . ఆ తర్వాత ఎలాంటి రోల్ నైనా చేసేందుకు సిద్ధపడిన ఇలియానాకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వలేదు. దీంతో మళ్ళీ తెలుగులో అవకాశాల కోసం ట్రై చేసింది. ఒకటి రెండు సినిమాల్లో చేసింది ..అవి కూడా ఫ్లాప్ అవడంతో మళ్ళీ తిరిగి బాలీవుడ్ లోని తలదాచుకుంది .

అయితే రీసెంట్గా టాలీవుడ్ లో ఓ బడా సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇలియానాకి ఇచ్చినట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు డైరెక్షన్లో రాబోతున్న 28 సినిమాలో ఇలియానా సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మహేష్ బాబు ఇలియానా కలిసిన పోకిరి సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. మళ్లీ ఈ జంట జోడి కడుతుండటంతో ఈసారి అలాంటి బ్లాస్టింగ్ పర్ఫామెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. మరి చూడాలి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news