Moviesసిమ్రాన్ ఆ సీనియర్ హీరోతో డేటింగ్ చేసిందా...? చివరికి అలాంటి వాడని...

సిమ్రాన్ ఆ సీనియర్ హీరోతో డేటింగ్ చేసిందా…? చివరికి అలాంటి వాడని తెలియడంతో…!

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో సిమ్రాన్ కూడా ఒకరు. సిమ్రాన్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. అందం తో పాటు తన అభినయంతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. తెలుగుతోపాటు తమిళ మలయాళ భాషల్లోనూ సిమ్రాన్ తన హావాను కొనసాగించారు. టాలీవుడ్ లో కలిసుందాం రా, నరసింహనాయుడు ,సీతయ్య తో పాటు అనేక చిత్రాలలలో నటించారు. కేవలం గ్లామర్ పాత్రలలో నటించకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించి మెస్మరైజ్ చేశారు.

అయితే తెలుగు కంటే సిమ్రాన్ తమిళ్ లో ఆఫర్లు ఎక్కువగా అందుకున్నారు. స్టార్ హీరోలు అందరితోనూ జోడి కట్టారు. ఇదిలా ఉండగా సిమ్రాన్ పై అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయన్న సంగతి చాలామందికి తెలియదు. పెళ్ళై పిల్లలు ఉన్న హీరోతో సిమ్రాన్ డేటింగ్ లో ఉంది అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ హీరో ఎవరో కాదు…. విశ్వనటుడు కమలహాసన్ తో సిమ్రాన్ డేటింగ్ లో ఉంది అంటూ జోరుగా వార్తలు వినిపించాయి. కమల్ హాసన్ – సిమ్రాన్ కాంబినేషన్ లో పంచతంత్రం సినిమా వచ్చింది. ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే తెలుగులో మాత్రం ఈ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా సమయంలోనే కమల్ హాసన్ సిమ్రాన్ ఒకరిపై ఒకరు మనసు మనసు పారేసుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ సినిమా సమయంలో సిమ్రాన్ కమలహాసన్ పార్టీలకు వెళ్లడం… కలిసి తిరగడం లాంటివి చేసేవారట. అయితే సిమ్రాన్‌కు కమలహాసన్ పెళ్లిళ్లు విడాకుల గురించి పూర్తిగా తెలిసిన తర్వాత ఆమె మెల్లిమెల్లిగా దూరమయ్యారని తెలుస్తోంది. అంతేకాకుండా కమలహాసన్ తో విడిపోయిన తర్వాత సిమ్రాన్ కు అతడికి జోడిగా దృశ్యం సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.

అయినప్పటికీ కమల్‌కు జోడిగా నటించనని సిమ్రాన్ ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపించాయి. ఈ విషయంపై సిమ్రాన్ తన స్నేహితుల వద్ద కూడా చెప్పుకుని బాధపడిన సందర్భాలు ఉన్నాయట. ఇక ఇదిలా ఉండగా సిమ్రాన్ కమలహాసన్ ను పూర్తిగా మర్చిపోయి దీపక్ బగ్గా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం సిమ్రాన్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ప్రస్తుతం సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో మరియు విలన్ రోల్స్ సైతం చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news