Moviesవారెవ్వా: అభిమానుల కోసం స్టైలీష్ హీరో సంచలన నిర్ణయం ..శభాష్ బన్నీ..!

వారెవ్వా: అభిమానుల కోసం స్టైలీష్ హీరో సంచలన నిర్ణయం ..శభాష్ బన్నీ..!

ఈ మధ్య కాలంలో హీరోలు రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఒక్కో హీరో 100 కోట్లు తీసుకుంటుంటే..సినిమాలు ఏమో నష్టాల బాట పడుతున్నాయి. అందుకే నిర్మాతలు సినీ ఇండస్ట్రీ భవిష్యత్తు కాలంలో నష్టల ఊబిలో కూరుకుపోకుండా..సినిమా షూటింగ్ లు ఆపేసి..తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్నారు.

మన హీరోలు చాలా మంది..సినిమాలతో పాటు..యాడ్స్ కూడా చేస్తారన్న సంగతి తెలిసిందే. ఒక్కో యాడ్ కి వాళ్ళ రేంజ్ కి తగ్గట్లు పారితోషకం పుచ్చుకుంటారు. ఇలా సినిమాలు చేస్తూ..యాడ్స్ చేసే మన టాలీవుడ్ హీరోలల్లో ముందు వరుస లో ఉంటాడు..మహేశ్ బాబు, బన్నీ. ఈ ఇద్దరు హీరోలు యాడ్స్ ఎక్కువుగా చేస్తుంటారు.

అయితే, రీసెంట్ గా బన్నీ కి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. ఏకంగా ఒక్క నిమిషం యాడ్ కోసం 10 కోట్లు ఇస్తామన్నారట. మిగతా ఏ హీరో అయినా ఈ ఆఫర్ ను కళ్ళు మూసుకుని యాక్సెప్ట్ చేస్తారు. డబ్బులు ఆకౌంట్లో వేసుకుంటారు. కానీ బన్నీ మాత్రం సెకండ్ కూడా ఆలోచించకుండా నో అని చెప్పేసారట. దానికి కారణం..అది గుట్కా అండ్‌ లిక్కర్‌ కంపెనీ కావడమే. జనాలకు హాని చేసే అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యం లేదని హీరో ఆ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసారట. దీంతో అభిమానుల కోసం కోట్ల ఆఫర్ ని వదులుకున్నావా ..శభాస్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news