Moviesబాల‌య్య - తార‌క్ - క‌ళ్యాణ్‌రామ్‌కు సూప‌ర్ హిట్లు ఇచ్చిన చిత్ర‌మైన...

బాల‌య్య – తార‌క్ – క‌ళ్యాణ్‌రామ్‌కు సూప‌ర్ హిట్లు ఇచ్చిన చిత్ర‌మైన డైలాగులు ఇవే…!

నందమూరి హీరోలకు మాస్ ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఐదు దశాబ్దాలుగా తెలుగు సినిమా చరిత్రలో నందమూరి వంశానికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. దివంగత ఎన్టీఆర్ నుంచి చాలామంది అభిమానులు ఆ తర్వాత బాలకృష్ణ- ఎన్టీఆర్- కళ్యాణ్‌రామ్‌ వరకు ఇలా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఇక నందమూరి హీరోలు ప్రస్తుతం కెరీర్ పరంగా తిరుగులేని ఫామ్ లో ఉన్నారు. గత ఎనిమిది నెలలుగా ముగ్గురు నందమూరి హీరోల సినిమాలు రిలీజ్ కాగా మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

విచిత్రం ఏంటంటే ఈ మూడు సినిమాలు కూడా రొటీన్ కు భిన్నమైన కథలతో వచ్చిన సినిమాలే కావడం విశేషం. ముందుగా గత డిసెంబర్లో బాలయ్య అఖండ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో బాలయ్య ఎవ్వరు ఊహించిన విధంగా అఘోరా పాత్రలో పవర్ ఫుల్ గా నటించాడు. ఇక మార్చిలో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదిలాబాద్ జిల్లాకు చెందిన గోండు జాతి వీరుడు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అలా ఒదిగిపోయాడు. ఈ సినిమా కథ కూడా రొటీన్ కు భిన్నంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక తాజాగా మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. ఇది కళ్యాణ్‌రామ్‌ కెరీర్ లోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక నందమూరి హీరోల సినిమాలలో చిత్ర విచిత్రమైన డైలాగ్స్ ఉంటే సినిమా హిట్ అవుతుంద‌ని చాలాసార్లు ప్రూవ్ అయింది. బాలయ్య నటించిన జానపద చిత్రం భైరవద్వీపం అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలయ్య మీరు అన్నది బాగున్నది నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా అనే చెప్పే వెరైటీ డైలాగ్ ఒకటి ఉంటుంది.

ఈ డైలాగ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బాలయ్యకు జోడిగా రోజా నటించారు. ఇక ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్లో సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిన సినిమా యమదొంగ. ఈ సినిమాలో తారక్ చెప్పిన బంబోలా జంబ డైలాగ్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసారా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ చెప్పిన జగత్ జజ్జరిక డైలాగ్ కూడా సినిమాకు భలే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ – కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఇలా నందమూరి హీరోలకు ఈ వెరైటీ డైలాగులు బాగా కలిసి వస్తున్నాయి అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news