Moviesపూరీ జగన్నాధ్ లో ఉన్న ఆ మగతనం..మిగతా డైరెక్టర్లలో లేదే..?

పూరీ జగన్నాధ్ లో ఉన్న ఆ మగతనం..మిగతా డైరెక్టర్లలో లేదే..?

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు డైలాగ్ కూడా చెప్పడం చేతకానీ హీరోలను ఇప్పుడు స్టార్ హీరోలుగా పాన్ ఇండియా హీరోలుగా సినీ ఇండస్ట్రీకి అందించిన ఘనత పూరి జగన్నాథ్ కే సొంతం అని చెప్పాలి. అందరు డైరెక్టర్స్ లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానీ ఈయన అలా కాదు.. సినిమా పూజా కార్యక్రమాల రోజు నే.. సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించి అదే రోజున సినిమా రిలీజ్ చేస్తే సత్తా ఉన్న ఏకైక టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రస్తుతం పూరీ టైం బాలేదు. గత కొంతకాలంగా ఒక్క హిట్టు కొట్టడానికి పూరీ.. పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు.

ప్రజెంట్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాపై పూరీ జగన్నాథ్ బోలెడు ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమాతో తన పూర్వ వైభవం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు పూరీ జగన్నాథ్. అయితే ఎందుకో తెలియదు ఈ సినిమాపై ఓ వర్గం నెగిటివ్ ప్రచారం చేస్తుంది. సినిమా ఓల్డ్ స్టోరీ అని పూరీ రేంజ్ హిట్ అందుకోలేడని సినిమా రిలీజ్ కాకముందే నెగటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు. దీంతో లైగర్ సినిమా పై 50-50 ఛాన్సెస్ ఉన్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా పూరి జగన్నాథ్ కు ఈ విషయంలో సాటిరారు చాలామంది డైరెక్టర్లు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి వెనకడుగు వేస్తుంటారు.అలా చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. కానీ పూరి మాటంటే మాటే..సినిమా పూజా కార్యక్రమాల రోజే రిలీజ్ డేట్ చెప్పి అదే రోజు రిలీజ్ చేసే టాలీవుడ్ లో సత్తా ఉన్న డైరెక్టర్. ఇప్పటివరకు ఇలాంటి డైరెక్టర్ టాలీవుడ్ లోనే లేరు అది అందరికీ తెలిసిన మాటే. దీంతో పూరీ ఫ్యాన్న్స్ ఆయనను ఇండస్ట్రీ ఒక్క మగాడు అంటూ పొగిడేస్తున్నారు. మిగతా డైరెక్టర్లు అందుకు పనికిరారు అంటూ లైగర్ ను ప్రమోట్ చేసుకుంటున్నారు. దీంతో పూరీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news