Moviesఇండస్ట్రీలో ప్రభాస్ ను టార్చర్ చేసిన ఏకైక హీరోయిన్..ఎన్ని ఇబ్బందులు పెట్టిందంటే..!?

ఇండస్ట్రీలో ప్రభాస్ ను టార్చర్ చేసిన ఏకైక హీరోయిన్..ఎన్ని ఇబ్బందులు పెట్టిందంటే..!?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. కాదు కాదు, ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్. ఈ పేరు చెబితే జనాలు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు. ఆ హైట్..ఆ వెయిట్ ..దానికి తగ్గట్టు కటౌట్.. అబ్బో ఈ హీరో కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సరైన హిట్టు కొట్టి దాదాపు కొన్ని ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికి ఈ హీరోకి ఉన్న ఫ్యాన్ ఫోలింగ్ చూస్తే మతులు పోవాల్సిందే . మరి ముఖ్యంగా బాలీవుడ్ జనాలకు పిచ్చెక్కిస్తున్నాడు ఈ ప్రభాస్.

అయితే బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్.. రెండు సినిమాలు భారీ డిజాస్టర్ గా అయినప్పటికి.. ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ తన ఆశలన్నీ ఆది పురుష్ పైనే పెట్టుకొని ఉన్నాడు. ఈ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన తదుపరి అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కిస్తున్నాడు. ఆది పురుష్, ప్రాజెక్ట్ ఖ్, సలార్ ఈ మూడు ప్రాజెక్టులు పై భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్.

 

జనరల్ గా సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ తో వర్క్ చేస్తే అందరూ చాలా మంచిగా చెప్తారు ఆయన గురించి. ప్రభాస్ జెంటిల్ మ్యాన్ అని ..సూపర్ స్టార్ ..అని ఫుడ్ పెడతాడు అని.. సరదాగా సెట్లో అందరితో కలిసి పోతారని అంటుంటారు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రమే ఇన్నాళ్ళ తన కెరీర్లో ఆయన గురించి బ్యాడ్ గా కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే. మనకు తెలిసిందే వీరిద్దరూ కలిసి రాధే శ్యామ్ అనే సినిమాలో కలిసినటించారు. ఆ టైంలో వీరిద్దరికీ అస్సలు పడలేదని పూజా హెగ్డే హెడ్ వెయిట్ చూపిస్తూ ప్రభాస్ ని అవహేళనగా మాట్లాడిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.

అంతేకాదు రాధే శ్యామ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఇద్దరు ఎడముఖం పెడమఖంగా ఉంటూ మీడియా కంట పడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు అంటూ వచ్చిన వార్తలు నిజమే అని అనుకున్నారు జనాలు. ఒకానొక టైంలో ప్రభాస్ పూజ హెగ్డే ఉంటే నటించననే వరకు వచ్చాడట . అంతలా ఆమె ఆయనను టార్చర్ పెట్టిందట. పూజా సెట్స్ లో హెడ్ వెయిట్ గా ప్రవర్తించడం షార్ట్ రెడీ అయిన టైంకి రాకపోవడం.. ప్రభాస్ షార్ట్ రెడీ అయితే ఆమె కావాలనే లేట్ చేయడం.. ఇలాంటి పనులతో పూజ ప్రభాస్ ని టార్చర్ చేసిందట ఫైనల్ గా సినిమా రిజల్ట్ కూడా దొబ్బేసింది . దీంతో ప్రభాస్ ఇక కెరియర్ లో పూజాతో నటించనని సన్నిహితులు దగ్గర చెప్పుకోచ్చారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news