Moviesకరణ్ జోహార్ చెప్పితేనే అలా చేశా..బిగ్ బాంబ్ పేల్చిన పూరీ జగన్నాధ్..!!

కరణ్ జోహార్ చెప్పితేనే అలా చేశా..బిగ్ బాంబ్ పేల్చిన పూరీ జగన్నాధ్..!!

టాలీవుడ్ నే కాకుండా బాలీవుడ్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా నే ఈ “లైగర్”. రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంట గా నటిస్తున్న సినిమా పై భారీ స్దాయిలో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ఆగస్టు 25 గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానున్న లైగర్ మూవీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనుల పై పూరి జగన్నాథ్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాగా లైగర్ సినిమా ప్రమోషన్స్లో పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేసుకున్నాడు. నిజానికి పూరి జగన్నాథ్ స్టోరీ రాసుకునేటప్పుడే ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ డాటర్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని అనుకున్నారట. స్టోరీ నీ బోని కపూర్ కి జాన్వీ కపూర్ కి కూడా వినిపించారట. కానీ అప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ.. ఈ సినిమా కోసం కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేక ఈ కథను వదులుకున్నారట .

అప్పుడే సినిమా నిర్మాణ భాగంలో భాగమవ్వమనిన్ కరణ్ కోరగా ఆ టైంలో హీరోయిన్ గురించి ప్రస్తావించగా అనన్య పాండే పేరు ఆయన సజెస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. నిజానికి అనన్య పాండేని లైగర్ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడానికి పూరి జగన్నాథ్ కు అస్సలు ఇష్టం లేదట. ఆయన వేరే హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నారట. కానీ కరణ్ జోహార్ చెప్పడంతోనే అనన్య పాండేని హీరోయిన్ గా తీసుకున్నామని పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.

కాగా పూరి జగన్నాధ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరణ్ జోహార్ చెప్పడంతోనే అనన్య పాండేని హీరోయిన్ గా తీసుకున్నామని ..కానీ సినిమాలో ఆమె పర్ఫామెన్స్ చూసాక ఈ సినిమాకు ఆమె అయితేనే సూపర్ గా ఉంటుందని అనిపించిందని.. ప్రతి సీన్స్ లో .. ప్రతి డైలాగ్స్ ఆమె పలికించే హావ భావాలు చాలా ఆకట్టుకుంటున్నాయని.. కచ్చితంగా సినిమా విజయానికి ఆమె మరో మెట్టు ఎక్కిస్తుందని పూరి జగన్నాధ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news