Moviesవావ్ ' గాడ్‌ఫాథ‌ర్ ' టీజ‌ర్ స్టైలీష్‌తో చంపేసిన చిరు (వీడియో)

వావ్ ‘ గాడ్‌ఫాథ‌ర్ ‘ టీజ‌ర్ స్టైలీష్‌తో చంపేసిన చిరు (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ యేడాది ఆచార్య‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిరు లైన్లో ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి. ముందుగా మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న లూసీఫర్ రీమేక్ గాడ్‌ఫాథ‌ర్‌లో చేస్తున్నాడు. ఈ సినిమా ద‌స‌రాకే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ వెంట‌నే బాబి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న వాల్తేరు వీర‌య్య‌.. ఆ వెంట‌నే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న భోళా శంక‌ర్ లైన్లో ఉన్నాయి. వాల్తేరు వీర‌య్య‌ను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. మెహ‌ర్ ర‌మేష్ సినిమా వ‌చ్చే యేడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇక రేపు చిరు బ‌ర్త్ డే కానుక‌గా ఈ రోజు భోళాశంక‌ర్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మెగాభిమానుల జోష్ మ‌రింత పెంచేలా గాడ్‌ఫాధ‌ర్ టీజ‌ర్ కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నయనతార కీలక రోల్ లో నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు ఈ సినిమాను గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. థమన్ మ్యూజిక్ అందిస్తుండ‌గా… ఈ సినిమాకు నిరవ్ షా ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

ఇక టీజ‌ర్‌లో 1.33 సెక‌న్ల పాటు ఉంది. ఇర‌వైఏళ్లు ఎక్క‌డ ఉన్నాడో తెలియ‌దు.. కానీ అత‌డొచ్చాక ఇక్క‌డ చాలా మార్పు వ‌చ్చింద‌ని బ్యాక్ గ్రౌండ్ వాయిస్ చిరు క్యారెక్ట‌ర్ ఎలాంటిదో రివీల్ చేసింది. అనంత‌రం న‌య‌న‌తార ఇక్క‌డ‌కు ఎవ‌రు వ‌చ్చినా రాక‌పోయినా ప‌ర్లేదు.. అత‌డు మాత్రం రాకూడ‌ద‌ని చిరు గురించి చెపుతోంది. ఓవ‌రాల్‌గా చూస్తే చిరుకు, హీరోయిన్ న‌య‌న‌తార‌కు ఏవో గొడ‌వ‌లు ఉంటాయ‌న్న‌ది క‌థ‌లో తెలుస్తోంది.

ఇక చిరు రెండు చేతుల్లో రెండు పిస్ట‌ల్స్‌తో కాల్చుకుంటూ చాలా స్టైలీష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. చిరు ఓ ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా ద‌ర్శ‌న‌మిచ్చాడు. థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. యాక్షన్ పొలిటికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 న విడుదల కానుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news