Moviesసండే రెండు మెగా అప్‌డేట్స్ వ‌చ్చేశాయ్‌... మెగా సంబ‌రాలు షురూ...!

సండే రెండు మెగా అప్‌డేట్స్ వ‌చ్చేశాయ్‌… మెగా సంబ‌రాలు షురూ…!

ఈ రోజు సండే రెండు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు అప్‌డేట్స్ వ‌చ్చేశాయి. ఇద్ద‌రు మెగా హీరోల సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఈ రోజు రిలీజ్ కావ‌డంతో మెగాభిమానుల సంబరాల‌కు అంతే లేకుండా పోయింది. రేపు మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే కావ‌డంతో ఈ రోజు ఉద‌యం నుంచే మెగాభిమానుల సంబరాల‌కు అంతే లేదు. సోష‌ల్ మీడియాతో పాటు బ‌య‌ట కూడా ట్రెండింగ్ స్టార్ట్ అయ్యింది. ప‌లువురు మెగాస్టార్‌కు బ‌ర్త్ డే విషెస్ చెపుతున్నారు.

ఇక ఈ రోజు మెగాస్టార్ న‌టిస్తోన్న భోళాశంక‌ర్ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమానుంచి ఈ రోజు సాలీడ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ రోజు భోళాశంక‌ర్ నుంచి అదిరిపోయే పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌తో పాటు మ‌రో ఊహించ‌ని అప్‌డేట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమాను ఏప్రిల్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఈ పోస్ట‌ర్‌లో చిరు మంచి స్వాగ్ అండ్ స్టైలీష్‌గా క‌నిపిస్తున్నాడు. దీంతో మెగాస్టార్ అభిమానుల ఆనందం మామూలుగా లేదు. అలాగే మ‌రో మెగా హీరో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ షూటింగ్ కూడా రేపు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభిస్తున్న‌ట్టు మైత్రీ మూవీస్ వాళ్లు అప్‌డేట్ ఇచ్చారు.

ఏదేమైనా సండే ఒకే రోజు రెండు మెగా హీరోల సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ రావ‌డంతో మెగాభిమానుల సంబ‌రాలు అయితే మామూలుగా లేవు.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news