Moviesమగధీర ఐటం బ్యూటీ ఇంతమందిని బుట్టలో వేసుకుందా ..? లిస్ట్‌లో టాలీవుడ్...

మగధీర ఐటం బ్యూటీ ఇంతమందిని బుట్టలో వేసుకుందా ..? లిస్ట్‌లో టాలీవుడ్ హీరో కూడా ..!

సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రు ఎప్పుడు ఎవ‌రితో డేటింగ్ చేస్తారో…ఎప్పుడు విడిపోతారో చెప్ప‌లేం. న‌చ్చినంత కాలం ఎంజాయ్ చేసి మోజు తీరాక విడిపోయేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ క‌ల్చ‌ర్ బాలీవుడ్ లో ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ లో తార‌లు న‌చ్చితే డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంటారు. లేదా డేటింగ్ త‌ర‌వాత ఎవ‌రిదారి వాళ్లు చూసుకుంటారు. అలా ఎక్కువ మందితో ప్రేమాయ‌ణాలు న‌డిపించిన హీరోయిన్ల‌ లిస్ట్ లో బాలీవుడ్ హీరోయిన్, మ‌గ‌ధీర సినిమాలో ఐట‌మ్ సాంగ్ కు స్టెప్పులు వేసిన కిమ్ శ‌ర్మ కూడా ఒక‌రు.

కిమ్ శ‌ర్మ ఖ‌డ్గం సినిమాలో కూడా ముసుగువేయొద్దు మ‌న‌సుమీద అనే పాట‌తో కుర్రకారు మతిపోగొట్టింది. మ‌గ‌ధీర కంటే ఏడేళ్ల ముందే 2002లోనే ఆమె కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఖ‌డ్గం సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత ఆమె కెన్యా దేశానికి చెందిన వ్యాపార‌వేత్త‌ అలి పుంజ‌ని అనే వ్య‌క్తిని 2010లో పెళ్లి చేసుకుని 2016లో విడాకులు తీసుకుంది. కిమ్ శ‌ర్మ కంటే వ‌య‌స్సులో అలి పుంజ చాలా పెద్దోడు. ఆమె కేవ‌లం డ‌బ్బుకు ఆశ‌ప‌డే అలిని పెళ్లాడింద‌ని అంటారు.

త‌న భ‌ర్త వేధింపుల‌కు గురి చేస్తున్నాడ‌ని ఆరోపిస్తూ విడిపోయింది. భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన త‌ర‌వాత ప‌లువురితో ల‌వ్ ఎఫైర్ లు న‌డిపింది. కిమ్ శ‌ర్మ ప్ర‌స్తుతం ప్ర‌ముఖ టెన్నిస్ ప్లేయ‌ర్ లియాండ‌ర్ పేస్ తో ప్రేమ‌లో ఉంది. వీరిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల లియాండ‌ర్ పేస్ తో కిమ్ శ‌ర్మ డేటింగ్ షురూ చేసి ఏడాది పూర్త‌య్యింది. పేస్ కూడా త‌న భార్య‌కు విడాకులు ఇచ్చేశాడు.

ఇక గ‌తంలో టీమ్ ఇండియా క్రికెక‌ట‌ర్ యువ‌రాజ్ సింగ్ తో కూడా ఈ బ్యూటీ ల‌వ్ ఎఫైర్ న‌డిపించింది. చాలా కాలం పాటూ యువ‌రాజ్ కిమ్ శ‌ర్మ డేటింగ్ లో ఉన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో ఏమో కానీ విడిపోయారు. ఆ త‌ర‌వాత యువ‌రాజ్ సింగ్ హాలీవుడ్ న‌టి హాజిల్ కిచ్ ను వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యాడు. ఇక కిమ్ శ‌ర్మతో డేటింగ్ చేసిన వాళ్ల లిస్టులో మ‌న టాలీవుడ్ హీరో కూడా ఉన్నాడు.

హీరో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కు టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లోనూ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అవును, మాయతో పాటూ ప‌లు చిత్రాల‌లో హీరోగా న‌టించాడు. అంతే కాకుండా బాలీవుడ్ లో స‌న‌మ్ రే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హ‌ర్ష‌న్ వ‌ర్ద‌న్ తో కూడా కిమ్ శ‌ర్మ చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగింది. కొంత కాలం డేటింగ్ లో మునిగితేలిన ఈ జంట ఆ త‌ర‌వాత విడిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news