Moviesప్రభాస్ హీరోయిన్ అందుకే పెళ్లికి దూరంగా ఉందా...? ఆమె లైఫ్‌లో స్పెషల్...

ప్రభాస్ హీరోయిన్ అందుకే పెళ్లికి దూరంగా ఉందా…? ఆమె లైఫ్‌లో స్పెషల్ పర్సన్ ఎవరు…?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్. సినిమాల కంటే అన‌వ‌స‌ర‌పు విష‌యాల‌లోనూ జోక్యం చేసుకుంటూ ఈ బ్యూటీ వివాదాస్ప‌ద న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. అప్ప‌ట్లో కంగానా చేసిన కామెంట్స్ వ‌ల్ల ఆమె ట్విట్ట‌ర్ ను సైతం బ్లాక్ చేశారు. దేశంలో తీసుకువ‌చ్చిన రైతు చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా రైతులు చేసిన‌ నిర‌స‌న స‌మ‌యంలో కంగ‌నా చేసిన కామెంట్స్ గొడ‌వ‌ల‌కు దారి తీసేలా ఉన్నాయ‌నే కార‌ణంగా ట్విట్ట‌ర్ ఖాతానే బ్లాక్ చేశారు. అంతే కాకుండా కంగ‌నా అధికారంలో ఉన్న బీజేపీకి కొమ్ము కాస్తుందని….అందువ‌ల్లే ప‌ద్మ అవార్డు కూడా ఆమెను వ‌రించింద‌ని ఆరోప‌ణలు ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ కాస్టింగ్ కౌచ్‌ను బ‌లంగా ప్ర‌చారం చేసి వెలుగులోకి తీసుకువ‌చ్చింది. బాలీవుడ్లో నెపోటిజంతో పాటు ఎంద‌రో స్టార్ హీరోల‌పై ఓపెన్‌గా కామెంట్ చేయ‌డంతో ఆమె లేడీ ఫైర్‌బ్రాండ్ అన్న ముద్ర వేసుకుంది. మ‌హారాష్ట్ర‌లో అధికారంలో ఉన్న శివ‌సేన ప్ర‌భుత్వంతోనూ గొడ‌వ‌కు దిగింది. ఎందులోనూ తాను వెన‌క్కు త‌గ్గేదేలే అన్న‌ట్టుగా కంగ‌న బిహేవియ‌ర్ ఉంటుంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యింది.

కానీ ఆ త‌ర‌వాత టాలీవుడ్ లో అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది. కానీ బాలీవుడ్ లో న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ముప్పై ఐదేళ్లు ఒంటి పైకి వ‌చ్చినా ఈ బ్యూటీ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ జీవితాన్నే గ‌డుపుతోంది. అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో కంగ‌నాను రాబోయే ఐదేళ్ల‌లో ఎలా క‌నిపించ‌బోతున్నారు అని ప్ర‌శ్నించ‌గా ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పింది. రాబోయే ఐదేళ్ల‌లో త‌న‌ను తాను త‌ల్లిగా చూడాల‌నుకుంటున్నాన‌ని బాంబు పేల్చింది. అంతే కాకుండా నాకు త్వ‌ర‌లోనే పిల్ల‌ల‌ను క‌నాల‌ని ఉంద‌ని చెప్పింది.

మీ జీవితంలో ఎవ‌రైనా స్పెష‌ల్ ప‌ర్స‌న్ ఉన్నారా ? అంటూ యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా ఉన్నారు. త్వ‌ర‌లోనే మీకు ప‌రిచ‌యం చేస్తా అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. కంగ‌నా చేసిన కామెంట్స్ తో ఆ స్పెష‌ల్ ప‌ర్స‌న్ ఎవరా అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా కంగనా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లో నటుడు ఆదిత్య పంచోలితో ల‌వ్ ఎఫైర్ న‌డిపించింద‌ని టాక్ వినిపించింది. కానీ అత‌డికి పెళ్లై పిల్ల‌లు ఉండ‌టం వ‌ల్ల వీరు విడిపోవాల్సి వ‌చ్చింద‌ని వార్త‌లు వచ్చాయి. ఆ కార‌ణం వ‌ల్లే ఇప్ప‌టికీ కంగ‌నా సింగిల్ గా ఉంటోంద‌ని కూడా బాలీవుడ్ లో టాక్ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news