Moviesప్రియమణితో రొమాన్స్ చేయలేకపోయిన స్టార్‌ హీరో ఎవ‌రంటే...!

ప్రియమణితో రొమాన్స్ చేయలేకపోయిన స్టార్‌ హీరో ఎవ‌రంటే…!

మొదటి సినిమాతో నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న నటి ప్రియమణి. తమిళంలో హీరోయిన్‌గా నటించిన పరుత్తి వీరన్ సినిమాతో అమ్మడికి జాతీయ అవార్డ్ దక్కింది. ఇలాంటి హీరోయిన్‌ని ఎవరూ అంత త్వరగా వదులుకోరు. ఏరికోరి మరీ అవకాశాలిస్తారు. ప్రియమణికి అలాంటి అవకాశాలే దక్కాయి. తెలుగులో ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నిర్మాత కేఎస్. రామారావు త‌న‌యుడు వ‌ల్ల‌భ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. అయినా ఆ తర్వాత జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్లైన కొత్తలో సినిమాలో అవకాశం అందుకుంది.

ఈ సినీమనే ప్రియమణికి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. దీని తర్వాత ప్రియమణి అటు బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సరసన సినిమాలు చేస్తూనే ఎన్టీఆర్‌, తరుణ్, నితిన్ లాంటి యంగ్ హీరోల సరసన రొమాంటిక్ పాత్రలను చేసింది. ప్రియమణి ఖాతాలో మంచి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక నితిన్ సరసన నటించిన ద్రోణ సినిమా అప్పట్లో హాట్ టాపిక్. ఎందుకంటే పెళ్లైన కొత్తలో, పరుత్తి వీరం లాంటి సినిమాలో ఆమె పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

ఏకంగా ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్‌లో ప్రియమణి బికినీలో కనిపించి హీటెక్కించింది. ఇక షూట్ సమయంలో ప్రియమణి బికినీలో తీసిన పిక్స్ నెట్టింట చక్కర్లు కొట్టి వైరల్ అయ్యాయి. ఎద అందాలతో పాటు శరీరంలోని మిగతా భాగాలు ప్రదర్శించి ఇరవై నుంచి అరవై ఏళ్ల వయసు వాళ్ళ వరకు అందరినీ వేడితో చచ్చేలా చేసింది. తెలుగులో నితిన్ హీరోగా వ‌చ్చిన ద్రోణ సినిమాలోనూ బికినీతో సెగ‌లు రేపింది.

 

ఈ పాత్ర‌ల‌ను చూసే దర్శకుడు పూరి జగన్నాథ్ ఆయన దర్శకత్వంలో రూపొందించిన గోలీమార్ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఈ సినిమాలో హీరో గోపీచంద్. సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్ ఎంత గ్లామర్‌గా కనిపిస్తుందో అందరికీ తెలిసిందే. ఇందులోనూ ప్రియమణి పాత్రను అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా బీచ్‌లో గోపీచంద్ – ప్రియమణిల మధ్య తెరకెక్కించిన రొమాంటిక్ సాంగ్ గుండెల్లో ఏదో సడి అనే లవర్స్‌కి మంచి ట్రీట్ అని చెప్పాలి. అయితే, అప్పటి వరకు గోపీచంద్ అలా బీచ్‌లో హీరోయిన్‌తో రొమాన్స్ చేసే సాంగ్‌లో నటించలేదు.

దాంతో గోలీమార్ సినిమాలో ఈ పాట చిత్రీకరణ సమయంలో ప్రియమణిని ముద్దు పెట్టుకునే షాట్స్‌లో చాలా ఇబ్బంది పడ్డాడట. ప్రియమణి చాలా ఈజీగా చేసినా గోపీచంద్ మాత్రం కౌగిలించుకునే షాట్స్ ముద్దు పెట్టుకే షాట్స్ చేయడానికి చాలా సిగ్గుపడి టేక్స్ ఎక్కువగా తీసుకున్నాడట. పూరి ఏంటీ గోపీ అని అడిగితే.. ప్రియతో రొమాన్స్ చేయాలంటే ఏదోలా ఉంది సార్ అన్నారట. మొత్తానికి ఎలాగోలా పూరి మానేజ్ చేసి ఈ సాంగ్ కంప్లీట్ చేసినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. సినిమాలో ఈ సాంగ్ బాగా వర్కౌట్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news