Moviesమహేష్ మీద‌ ఆశపడ్డ ఆ హీరోయిన్‌కు కెరీర్ స్టార్టింగ్‌లోనే పెద్ద షాక్...!

మహేష్ మీద‌ ఆశపడ్డ ఆ హీరోయిన్‌కు కెరీర్ స్టార్టింగ్‌లోనే పెద్ద షాక్…!

మహేష్ సినిమా ఆశపడితే కెరీర్ ప్రారంభంలోనే కోలుకోలేని దెబ్బపడింది..కృతి సనన్‌కి. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ అంటే ఎంతటి క్రేజ్, ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే. ఆర్య లాంటి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సుక్కూ..తన మార్క్‌ను చూపించారు. ప్రేమ కథలను కాస్త వెరైటీగా చూపించి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. సుకుమార్ సినిమా అంటే అన్నీ వర్గాల ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందేనే పేరు తెచ్చుకున్నారు. అస‌లు సుక్కు ఎంచుకునే క‌థ‌లే కొత్త‌గా ఉంటాయి.

అల్లు అర్జున్, రామ్‌, రామ్‌ చరణ్, ఎన్.టి.ఆర్ మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు చేసి అగ్ర దర్శకుల జాబితాలో చేరారు. ఇండస్ట్రీలో సుకుమార్ దర్శకుడిగా చేసింది చాలా తక్కువ సినిమాలే. కానీ, స్టార్ డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సుక్కూ సినిమాలలో హీరో పాత్ర ఎంత బలంగా ఉంటుందో అంతే బలంగా హీరోయిన్ పాత్రను రాస్తారు. అందుకే, తన సినిమాలలోని హీరోయిన్ పాత్రలు బాగా పాపులర్ అవుతాయి.

ఇలాంటి ఆశ‌ల‌తోనే కృతి సనన్ కూడా సుకుమార్ సినిమాకు ఓకే చెప్పేసింది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో అంటే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోవచ్చునని సంబరపడింది. తీరా చూస్తే సుకుమార్, మహేష్‌ల 1 నేనొక్కడినే ఫ్లాప్ సినిమాగా మిగిలింది. వాస్తవంగా అయితే, కృతి సనన్ పర్ఫార్మెన్స్ పరంగా అయినా బాగా అవకాశాలు అందుకోవాలి. కానీ, మొదటి సినిమా ఫ్లాప్ అవడం ఇండస్ట్రీలో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది.

చూడ‌డానికి కావాల్సినంత అందంతో పాటు అభిన‌యం ఉన్నా కూడా కృతి ప్రేక్ష‌కుల‌కు రిజ‌స్ట‌ర్ కాలేదు.
ఆ తర్వాత చేసిన దోచేయ్ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా ఇద్దరు పెద్ద హీరోలతో హీరోయిన్‌గా సినిమాలు చేస్తే అవి కృతి సనన్ కెరీర్‌కి ఏమాత్రం పనికిరాలేదు. దాంతో టాలీవుడ్‌లో అడ్రస్ లేకుండా పోయింది. అయితే, బాలీవుడ్‌లో అమ్మడు మంచి క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ అయింది. ఇప్పుడు ప్రభాస్ సరసన గ్లోబల్ మూవీ ఆదిపురుష్ చేస్తుంది. ఇది గనక హిట్ అయితే, ఇక మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టే ఛాన్స్ వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news