Moviesవావ్‌... మెగాస్టార్ ఫ్యాన్స్‌కు రెండు బ‌డా ఫెస్టివ‌ల్స్‌..!

వావ్‌… మెగాస్టార్ ఫ్యాన్స్‌కు రెండు బ‌డా ఫెస్టివ‌ల్స్‌..!

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం మూడు సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూడు సినిమాల్లో ముందుగా మ‌ళ‌యాళ హిట్ సినిమా లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా వ‌స్తోన్న గాడ్‌ఫాద‌ర్‌తో పాటు కోలీవుడ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ భోళాశంక‌ర్‌, వాల్తేరు వీర‌య్య‌. ఈ మూడు సినిమాల్లో గాడ్ ఫాద‌ర్‌కు ఒరిజిన‌ల్ వెర్ష‌న్ డైరెక్ట్ చేసిన మోహ‌న‌రాజానే ద‌ర్శ‌కుడు. ఈయ‌న గ‌తంలో తెలుగులో హ‌నుమాన్ జంక్ష‌న్ సినిమాను డైరెక్ట్ చేశాడు. భోళాశంక‌ర్‌కు మెహ‌ర్ ర‌మేష్‌, వాల్తేరు వీర‌య్య‌కు బాబి ద‌ర్శ‌కులు.

ఈ మూడు సినిమాల్లోనూ ముగ్గురు టాప్ హీరోయిన్ల‌తో చిరు రొమాన్స్ చేస్తున్నాడు. గాడ్ ఫాద‌ర్‌లో న‌య‌న‌తార – భోళా శంక‌ర్‌లో త‌మ‌న్నా – వాల్తేరు వీర‌య్య‌లో శృతీహాస‌న్ హీరోయిన్లు. ఇక ఈ యేడాది ఇప్ప‌టికే ఆచార్య సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన చిరు ద‌స‌రాకు గాడ్ ఫాద‌ర్‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఒక్క‌సారిగా అంచ‌నాలు అయితే పెంచేసింది. సినిమా ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంద‌నే అంటున్నారు. ఇక గాడ్ ఫాద‌ర్ వ‌చ్చిన మూడు నెల‌ల‌కే సంక్రాంతికి మెగా ఫ్యాన్స్‌కు మ‌రో పెద్ద పండ‌గ రానుంది. అదే వాల్తేరు వీర‌య్య రిలీజ్‌. బాబి ద‌ర్శ‌క‌త్వంలో చిరు 154వ సినిమాగా వ‌స్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చేశారు.

చిరు – శృతీహాస‌న్ జోడీగా తెర‌కెక్కుతుండ‌డంతో పాటు అదిరిపోయే మాస్ మ‌సాలా మూవీగా వ‌స్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఈ రెండు సినిమాల‌తో తానేంటో చిరు ఫ్రూవ్ చేసుకోవ‌డంతో పాటు మెగా బాస్‌గా సూప‌ర్ క్రేజ్‌తో కం బ్యాక్ ఇస్తార‌ని మెగాభిమానులు ఆశిస్తున్నారు. త‌క్కువ టైంలోనే మెగాబాస్ రెండు సినిమాల‌తో త‌న ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్ ఇస్తుండ‌డంతో మెగాభిమానుల జోష్ మామూలుగా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news