Moviesసింహాద్రి - చెన్న‌కేశ‌వ‌రెడ్డి.. తారుమారు అయిన బాబాయ్‌, అబ్బాయ్ సినిమాలు..!

సింహాద్రి – చెన్న‌కేశ‌వ‌రెడ్డి.. తారుమారు అయిన బాబాయ్‌, అబ్బాయ్ సినిమాలు..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో సింహాద్రి ఎంత పెద్ద హిట్లో చెప్ప‌క్క‌ర్లేదు. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్‌కు మ‌ళ్లీ త్రిబుల్ ఆర్ సినిమాతోనే సింహాద్రి రేంజ్ హిట్ వ‌చ్చింది. వ‌సూళ్లు, లాభాల ప‌రంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్‌లో సింహాద్రే ఇప్ప‌ట‌కీ టాప్ సినిమా. ఆ సినిమాకు జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్‌.. వ‌చ్చిన లాభాలు చూస్తే సింహాద్రిని మించిన హిట్ లేనే లేదు. అటు బాల‌య్య కెరీర్‌లో ప‌వ‌ర్ ఫుల్ సినిమాల్లో చెన్న‌కేశ‌వ‌రెడ్డి ఒక‌టి.

 

ఈ రెండు సినిమాల్లో చెన్న‌కేశ‌వ‌రెడ్డి 2002లో వ‌స్తే.. సింహాద్రి 2003లో రిలీజ్ అయ్యింది. చెన్న‌కేశ‌వ‌రెడ్డికి వివి. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు, సింహాద్రికి రాజ‌మౌళి డైరెక్ట‌ర్‌. ఈ రెండు సినిమాల‌కు లింక్ ఉంది. ముందుగా చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా విష‌యానికి వ‌స్తే వినాయ‌క్ ఇచ్చిన క‌థ‌ను ద‌ర్శ‌కుడు వి. స‌ముద్ర‌తో తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. ఈ క‌థ అనుకున్న‌ప్పుడు ఆది అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉంది.

సింహ‌రాశి సినిమా హిట్ అయ్యాక బాల‌య్య స‌ముద్ర‌తో సినిమా చేయాల‌ని అనుకున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత‌. ముందుగా ఓ క‌థ అనుకున్నారు. స‌ముద్ర డైరెక్ష‌న్‌లో సినిమా స్టార్ట్ అవ్వ‌డ‌మే ఆల‌స్యం.. ఈ లోగా సీన్ తారుమారు అయ్యింది. ఆది సినిమా రిలీజ్ అయ్యి ఊహించ‌ని హిట్ అయ్యింది. దీంతో బాల‌య్య‌తో పాటు నిర్మాత బెల్లంకొండ సురేష్ తాము ముందు అనుకున్న క‌థ‌తో పాటు ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ను ప‌క్క‌న పెట్టేసి వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో చెన్న‌కేశ‌వ‌రెడ్డి ప్లాన్ చేసుకున్నారు.

 

అయితే ఆ త‌ర్వాత అటు నిర్మాత బెల్లంకొండ‌, హీరో బాల‌య్య ఇద్ద‌రూ కూడా స‌ముద్ర‌కు ఫోన్ చేసి మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తామ‌ని చెప్పిన‌ట్టు స‌ముద్రే స్వ‌యంగా చెప్పారు. అలా స‌ముద్ర చేయాల్సిన సినిమా కాస్తా వినాయ‌క్ చేతుల్లోకి వెళ్లింది. ఇక సింహాద్రి విష‌యానికి వస్తే ఈ సినిమా క‌థ రెడీ అయ్యాక బాల‌కృష్ణ హీరోగా బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల‌ని అనుకున్నారు.

ఈ సినిమాకు కూడా నిర్మాత‌గా ముందు బెల్లంకొండ సురేష్‌నే అనుకున్నార‌ట‌. అయితే బాల‌య్య‌కు, నిర్మాత సురేష్‌కు కూడా క‌థ అంత‌గా న‌చ్చ‌లేద‌ట‌. ఎందుకంటే బాల‌య్య అప్ప‌టికే వ‌రుస‌గా ఫ్యాక్ష‌న్ సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నారు. దీంతో ఇదే క‌థ‌తో ఎన్టీఆర్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సింహాద్రి సినిమాగా తెర‌కెక్కించారు. ఈ సినిమాను అప్పుడు సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉన్న వి. దొర‌స్వామిరాజు నిర్మించారు. అలా చెన్న‌కేశ‌వ‌రెడ్డికి ముందు అనుకున్న డైరెక్ట‌ర్ మారితే.. సింహాద్రికి ముందు అనుకున్న హీరో మారిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news