Moviesవివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి కారణం అదే..సమంత సంచలన వ్యాఖ్యలు..!!

వివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి కారణం అదే..సమంత సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా మిడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. మరీ ముఖ్యంగా సమంత విడాకులు తీసుకున్నప్పటి నుండి..నెట్టింట సమంత పేరు..హైలెట్ గా నిలుస్తుంది. నాగచైథన్య ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సామ్..ఈ మధ్యనే విడాకులు తీసుకుని..సపరేటు గా ఉంటుంది. విడాకుల తరువాత జెట్ స్పీడ్ లో సినిమాలకు కమిట్ అవుతూ..పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

బాలీవుడ్ లో కూడా కాళ్లు మోపడానికి ట్రై చేస్తున్న సమంత…రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షో కి గెస్ట్ గా వెళ్లింది ఆమె తో పాటు అక్షయ్ కుమార్..కూడా వెళ్లిన్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్ .

ఈ ప్రోమో లో సమంత చాలా హాట్ గా కనిపించింది. అంతేకాదు హోస్ట్ కరణ్ జోహార్ తో చాలా సరదాగా మాట్లాడుతూ..పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ ల తో చెలరేగిపోయింది. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ తో మాట్లాడుతూ..’ఎంతోమంది వివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి మీరే కారణం అంటూ బిగ్ బాంబ్ పేల్చిందీ దీంతో కరణ్ ‘నేనేం చేశాను’ అని అడగ్గా.. ‘పెళ్లి చేసుకుంటే జీవితం కబీ ఖుషి కబీ ఘమ్‌ సినిమాలా ఉంటుందని స్క్రీన్‌పై చూపించారు. కానీ, రియల్ లైఫ్ కి వచ్చేసరికి.. KGFమూవీలా ఉంటుంది’ అని సమంత తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news