Moviesఆ విషయాన్ని కొరటాల గుర్తుపెట్టుకుంటే మంచిది.. కొత్త హీట్ పెంచిన పరుచూరి...

ఆ విషయాన్ని కొరటాల గుర్తుపెట్టుకుంటే మంచిది.. కొత్త హీట్ పెంచిన పరుచూరి గోపాలకృష్ణ పాఠాలు ..!!

యస్..రీసెంట్ గా మాట్లాడిన పరచూరి గోపాల కృష్ణ మాటాలు వింటుంటే..ఇన్ డైరెక్ట్ గా స్టార్ డైరెక్టర్ కొరటాలకి క్లాస్ పీకిన్నట్లు ఉంది అంటున్నారు జనాలు. మనకు తెలిసిందే కొరటాల శివ డైరెక్షన్ లో మెగా హీరోలు..చిరంజీవి, చరణ్..ఇద్దరు కలిసి నతీంచిన సినిమా “ఆచార్య”. కొణిదేల ప్రోడక్షన్స్ పై రామ్ చరణ్ ఈ సినిమా నిర్మించాడు.

కొరటాల ట్రాక్ రికార్డ్..మెగా హీరోల ఫాలోయింగ్ ..ఇలా సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్నారు ఫ్యాన్స్. సీన్ కత్ చేస్తే..మెగా హీరో రేంజ్ బ్లాక్ బస్టర్ కాదు కదా..కనీసం పాజిటీవ్ టాక్ ని కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో అప్పట్లో కొరటాల పై హ్యూజ్ ట్రోల్స్ చేసారు జనాలు. అసలు కధలో తల తోక లేదు..అంటూ దాఉణంగా ట్రోల్ చేశారు.

 

అయితే, తాజాగా ఈ సినిమా చూసిన పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని ‘పరుచూరి పాఠాలు’ అంటూ తెలియజేశారు. ఫస్ట్ ఇలాంటి కాంట్రవర్షీయల్ పాయింట్ తీసుకున్న కొరటాల గత్స్ కి మెచ్చుకుంటూ..ఇలాంటి కధలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి కూడా పొగిడేశారు. అయితే, ఈ కధ మెగా రేంజ్ స్దాయిది కాదని తేల్చి చెప్పారు. అస్సలు సినిమాలో చరణ్ లేకపోయుంటే కధ వేరేలా ఉండేదని..ఈ సినిమా చూస్తుంటే చాలాకాలం క్రితం మేము రాసిన ‘మరో మలుపు’ సినిమా గుర్తుకు వచ్చిందని చెప్పుకొచ్చారు.

సస్పెన్స్.. సెంటిమెంట్ ఒక ఒరలో ఇమడవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి..అంటూ కొరటాలకు సజీషన్స్ ఇచ్చారు. ఈ జనరేషన్ కి అభ్యుదయ భావాలు.. కమ్యూనిజానికి సంబంధించిన కథలు ఎక్కడం లేదు..బహుశా ఈ సినిమా ఫ్లాప్ కి అది కూడా కారణం అయ్యి ఉందచ్చు. చరణ్ పాత్రను ఫస్టాఫ్ లో అక్కడక్కడా చూపించి ..ఫైనల్ ట్వీస్ట్ మార్చుంటే కధ ఇంకా బాగుండేది. చరణ్ పాత్రను సెకండాఫ్ వరకూ సీక్రేట్ గా ఉంచడం వల్ల.. కథ జనానికి ఎక్కలేదు..” అంటూ తన అభిప్రాయాని తెలియజేశాడు..గోపాలకృష్ణ .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news