Moviesనాకు ఆ అర్హత లేదు..మహేశ్‌ బాబు నోట ఊహించని మాట ..!!

నాకు ఆ అర్హత లేదు..మహేశ్‌ బాబు నోట ఊహించని మాట ..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటాదో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. ఇండస్ట్రీలో అందరికి ఆయన అంటే అదో తెలియని గౌరవం. ఎటువంటి కాంట్రవర్షీయల్ కు పోకుండా,,సైలెంట్ గా తన పని తాను చూసుకుని పోయేవాళ్లల్లో మహేశ్ ఒకరు. తనకు ఏదైన సినిమా నచ్చితే..అవతలి వ్యక్తి ఎంతటి పెద్ద హీరో అయినా..

తన కంటే ఎంత చిన్న స్ధాయి హీరొ సినిమాలకు అయినా సరే.. సినిమా బాగుంటే ఖచ్చితంగా పొగుడుతూ…ట్వీట్ చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు కూడా తన దైన స్టైల్ లో రివ్యూ ఇచ్చి..కమల్ హాసన్ అభిమానులను మెప్పించాడు.

కోలీవుడ్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ మెయిన్ లీడ్ గా తెర‌కెక్కి భారీ హిట్ కొట్టిన విక్ర‌మ్ సినిమాపై టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై మ‌హేశ్ బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ను పోస్ట్ చేశాడు. విక్ర‌మ్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింద‌ని కొనియాడాడు.ఈ మేరకు ఆయన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో..”విక్రమ్‌ సినిమా బ్లాక్‌బస్టర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ చిత్రం గా నిలిచింది.

లోకేశ్ కనకరాజ్.. నేను మిమ్మల్ని కలిసి విక్రమ్‌ మూవీ ప్రారంభం నుంచి చివరి వరకు షూటింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉంది. సినిమాకి మరో ప్లస్ పాయింట్ విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్ నటన. అనిరుధ్‌ బెస్ట్ మ్యూజిక్ అందించాడు. లెజెండ్ కమల్ హాసన్ నటన గురించి చెప్పే అర్హత నాకు లేదు. ఒక అభిమానిగా నేను విక్రమ్ మూవీ చూసి చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. మీకు కంగ్రాట్స్ సర్ అంటూ మహేష్ బాబు సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. మహేష్ బాబు విక్రమ్ మూవీపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కమల్ ఇంకా సూర్య అభిమానులు ఈ ట్వీట్స్ ని వైరల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news