Moviesఆ హీరోను న‌మ్మి నిండా మునిగిపోయిన ర‌కుల్‌ప్రీత్‌... కెరీర్ క్లోజ్ చేసేసుకుంది...!

ఆ హీరోను న‌మ్మి నిండా మునిగిపోయిన ర‌కుల్‌ప్రీత్‌… కెరీర్ క్లోజ్ చేసేసుకుంది…!

తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ చాలా బిజీగా సినిమాలు చేసింది రకుల్ ప్రీత్ సింగ్. కెరటం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె ఆ తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా మంచి క్రేజ్ తీసుకువచ్చి పెట్టింది. దాంతో తెలుగులో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసే అవకాశాలు చక చకా అందుకుంది. నాగ చైతన్యతో రారండో వేడుక చూద్దాం, ఎన్.టి.ఆర్ సరసన నాన్నకు ప్రేమతో, రామ్‌ చరణ్ సరసన బ్రూస్‌లీ, ధృవ, గోపీచంద్ కి జంటగా..ఇలా దాదాపు యంగ్ హీరోలందరితోనూ నటించింది.

ఒక దశలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాకి కూడా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉండింది. ఆ తర్వాత స్పైడర్ సినిమా చేసినా అది ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నుంచే రకుల్ కెరీర్ ఊహించని విధంగా మలుపుతిరిగింది. చేసిన ప్రతీ సినిమా ఫలితం బాక్సాఫీస్ వద్ద తేడాగా రావడంతో రకుల్ ని పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇదే సమయంలో రకుల్ చేసిన అతి పెద్ద మిస్టేక్..సీనియర్ హీరో కింగ్ నాగార్జున ని నమ్మి అతని సరసన హీరోయిన్‌గా నటించడం.

చి ల సౌ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో నాగార్జున ని ఈ ఏజ్ లో కూడా మన్మధుడిగా చూపించాలని స్క్రిప్ట్ రాసుకున్నారు. మన్మధుడు బ్లాక్ బస్టర్ కావడంతో దానీ సీక్వెల్ అంటూ ప్రచారం చేసి సినిమాపై హైప్ తెచ్చారు. మ‌న్మ‌ధుడు 2 సినిమా తెర‌కెక్కించారు. తీరా చూస్తే ఆ కథకి ఈ కథకి అసలు సంబంధం లేదు. పైగా ఈ సినిమాలో నటించిన రకుల్ కెరీర్ మొత్తం దెబ్బతో మటాష్ అయిపోయింది.

సినిమా కథ అసలు కరెక్ట్ కాదు. దానికి తోడు హీరో నాగార్జున కి జంటగా నటించడం రకుల్ చేసిన పొరపాటు. నాగార్జున ని నమ్మితే ఈ సినిమాతో రకుల్ ని నిండా ముంచేశాడు..అని సినిమా ఫ్లాప్ తర్వాత అందరూ మాట్లాడుకున్నారు. ఎన్ని బ్లాక్ బస్టర్ వచ్చిన ఒక్క రాంగ్ మూవీ చేస్తే కెరీర్ ఎలా తలకిందులు అవుతుందో రకుల్ ప్రీత్ సింగ్ ఉదాహరణ. ప్రస్తుతం తను హిందీ సినిమాలలో మాత్రమే నటిస్తోంది.

చేతిలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. తమిళ పాన్ ఇండియా సినిమా ఇండియన్ 2లో రకుల్ నటించాల్సి ఉంది. మరి ఇందులో చేస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. మ‌రోవైపు జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉంది.. త్వ‌ర‌లోనే పెళ్లంటోంది. ఇప్ప‌టికే దాదాపుగా ఫేడ‌వుట్ అయిపోయిన ర‌కుల్ పుంజుకునే ఛాన్స్ అయితే లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news